Harish Rao : ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో గోస పడిన తెలంగాణ ఇప్పుడు సీఎం కేసీఆర్ సారథ్యంలో ప్రగతి పథంలో పయనిస్తోందని అన్నారు ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు(Harish Rao). సిద్దిపేట జిల్లా అభివృద్ది కోసం సీఎం కోట్లాది రూపాయలు మంజూరు చేశారని స్పష్టం చేశారు.
Harish Rao Words about Siddipet
ఇందులో భాగంగా ఇప్పుడు రాష్ట్రానికే సిద్దిపేట ప్రాంతం ఆదర్శ ప్రాయంగా మారిందన్నారు. మన సిద్దిపేటకు గోదావరి జలాలతో పాటు రైలు కూడా వచ్చిందన్నారు. ఇంత కంటే గొప్ప సంతృప్తి ఉంటుందన్నారు. మాటల్లో కాదు చేతల్లో కూడా చేసి చూపించిన అద్భుతమైన నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు.
ఉమ్మడి రాష్ట్ర పాలనలో అభివృద్ది అన్నది నినాదాలకే పరిమితమై ఉండేదని అన్నారు. కానీ స్వరాష్ట్రంలో పనులన్నీ నిజాలుగా మారాయని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ చలవ వల్ల సిద్దిపేట ప్రజలు కళ్లల్లో ఆనందం వెల్లి విరుస్తోందని చెప్పారు హరీశ్ రావు.
సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశానికి ఆదర్శ ప్రాయంగా నిలిచిందని, దీనికి ప్రధాన కారకుడు సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరావు అని కొనియాడారు. ఇదిలా ఉండగా తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే హన్మంతు రావు హరీశ్ రావుపై తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు.
Also Read : Pride Of India : దిగ్గజ కంపెనీలు సిఈవోలు మనోళ్లు