Hydrogen Coach: భారత్‌ లో తొలి హైడ్రోజన్ కోచ్ పరీక్ష విజయవంతం

భారత్‌ లో తొలి హైడ్రోజన్ కోచ్ పరీక్ష విజయవంతం

Hydrogen Coach : దేశంలో మొట్టమొదటి హైడ్రోజన్ కోచ్‌ను విజయవంతంగా పరీక్షించి… భారతీయ రైల్వే చరిత్ర సృష్టించింది. ఈ వీడియోను కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vaishnaw) సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. హైడ్రోజన్ ఇంధనంతో నడిచే ఈ రైళ్లు… కాలుష్యాన్ని తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తాయి. పర్యావరణానికి హానికరం కాని, స్వచ్ఛమైన ఇంధన వనరుల వైపు భారత్‌ అడుగులు వేస్తోంది. ఇది భారతీయ రైల్వేను మరింత టెక్నాలజీ పరంగా అభివృద్ధి చేయడంతో ముందడుగు పడింది.

Indian Railways Hydrogen Coach

ఈ ప్రాజెక్ట్‌ విజయవంతం కావడం… భారత్‌ ని హైడ్రోజన్ ఆధారిత రైల్వే సాంకేతికతలో ప్రపంచదేశాల సరసన అగ్రగామిగా నిలబెడుతుందని అశ్విని వైష్ణవ్ ట్వీట్‌ చేశారు. భారత్‌ 1,200 HP హైడ్రోజన్ రైలును అభివృద్ధి చేసింది. ఇది దేశీయ రవాణా రంగానికి ఒక కీలక మైలురాయి’’అని ఆయన పేర్కొన్నారు. మొత్తం హైడ్రోజన్-పవర్డ్ కోచ్ (డ్రైవింగ్ పవర్ కార్) చెన్నైలోని ఐసీఎఫ్‌ వద్ద విజయవంతంగా పరీక్షించబడిందన్నారు.

హైడ్రోజన్ ఫర్ హెరిటేజ్ (Hydrogen Coach) పథకంలో భాగంగా 35 హైడ్రోజన్ రైళ్లను తయారు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ రైళ్లను దేశ వ్యాప్తంగా హెరిటేజ్, హిల్ స్టేషన్లలో నడపాలని భావిస్తోంది. భారతీయ రైల్వే ఇప్పటికే ఉన్న డీజిల్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ (DEMU)ను హైడ్రోజన్ ఫ్యూయెల్ సెల్‌తో నడిచే విధంగా చేసే పైలట్ ప్రాజెక్ట్‌ను కూడా రైల్వేశాఖ చేపట్టింది.

Hydrogen Coach – 89% టికెట్లు ఆన్‌లైన్‌లోనే బుకింగ్‌ – రైల్వే మంత్రి

రైల్వే ప్రయాణికుల్లో ఎక్కువ శాతం ఆన్‌లైన్‌కే మొగ్గుచూపుతున్నారని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ వెల్లడించారు. దాదాపు 89% రైల్వే టికెట్లు ఆన్‌లైన్‌ లోనే బుకింగ్‌ అవుతున్నాయన్నారు. డిజిటల్‌ రిజర్వేషన్లు, ఐఆర్‌సీటీసీలో కోట్లాది యూజర్‌ ఐడీల డీయాక్టివేట్‌ అవడంపై పార్లమెంటు సభ్యులు అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వ సమాధానం ఇచ్చారు.

‘‘ఆన్‌లైన్‌ లేదా ప్యాసింజర్‌ రిజర్వేషన్‌ సిస్టమ్‌ (PRS) మొదట వచ్చిన వారికి తొలి ప్రాధాన్యం క్రమంలో రిజర్వు టికెట్లను పొందవచ్చు. మొత్తం టికెట్లలో 89శాతం ఆన్‌లైన్‌ విధానంలోనే బుక్‌ అవుతున్నాయి. ఈ పీఆర్‌ఎస్‌ కేంద్రాల్లో ఆన్‌లైన్‌ పేమెంట్‌ చేసుకునే సౌలభ్యం ఉంది. జులై 1, 2025 నుంచి ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌/యాప్‌లలో ఆధార్‌ ధ్రువీకరణ ద్వారానే తత్కాల్‌ టికెట్లు బుక్‌ చేసుకునే విధానాన్ని అమలు చేస్తున్నాం’’ అని అశ్విని వైష్ణవ్‌ వెల్లడించారు.

2.5 కోట్ల ఐడీలు డీయాక్టివేట్‌ చేసాం

‘‘టికెట్‌ బుకింగ్‌ విధానంలో అవకతవకలను అరికట్టేందుకు గాను ఐఆర్‌సీటీసీ ఇటీవల 2.5కోట్ల యూజర్‌ ఐడీలను డీయాక్టివేట్‌ చేసింది. డేటా విశ్లేషణలో అనుమానాస్పదంగా గుర్తించి ఈ చర్యలు తీసుకుంది’’ అని రైల్వే మంత్రి వెల్లడించారు. ప్రయాణికుల అవసరాలకు తగినట్లుగా ఎప్పటికప్పుడు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. రైళ్లలో వెయిటింగ్‌ లిస్టులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని, డిమాండ్‌కు తగినట్లు ప్రత్యేక సర్వీసులు లేదా కోచ్‌ల ఏర్పాటు చేస్తున్నామన్నారు. రిజర్వుడు సీట్ల కోసం ఏడాది మొత్తం ఒకేవిధంగా డిమాండ్‌ ఉండదని, ఆయా సీజన్లలో వేర్వేరుగా ఉంటుందన్నారు.

Also Read : CDS Anil Chauhan: భారత్‌ అత్యంత అప్రమత్తంగా ఉండాలి – సీడీఎస్‌ అనిల్‌ చౌహాన్‌

Leave A Reply

Your Email Id will not be published!