Nirmala Sitharaman : క్రిప్టో క‌రెన్సీ ప‌ట్ల భార‌త్ వైఖ‌రి భేష్

జి20 లో ప‌లు దేశాలు మ‌ద్ద‌తు

Nirmala Sitharaman Crypto : క్రిప్టో క‌రెన్సీ ల‌పై భార‌త దేశానికి స్ప‌ష్ట‌మైన వైఖ‌రి ఉంది. దీనిని జీ20 స‌భ్య దేశాలు ప్ర‌త్యేకంగా అభినందించిన‌ట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్(Nirmala Sitharaman Crypto) . క్రిప్టో క‌రెన్సీల వెనుక ఉన్న సాంకేతిక‌త వివిధ ప్ర‌యోజ‌నాల కోసం ఉప‌యోగ ప‌డుతుంద‌న్న భార‌త దేశ అభిప్రాయానికి అన్ని దేశాలు సానుకూలం వ్య‌క్తం చేశారు. ఈ విష‌యాన్ని స్వ‌యంగా ప్ర‌క‌టించారు విత్త మంత్రి. అయితే సార్వ భౌమాధికారం లేని క‌రెన్సీని అలా ప‌రిగ‌ణించ లేమంటూ భార‌త్ స్ప‌ష్టం చేసింది ఇప్ప‌టికే.

జీ20 దేశాలు పెద్ద ఎత్తున మ‌ద్ద‌తు ప‌లికాయ‌ని తెలిపారు. ఆయా దేశాల‌కు చెందిన ఆర్థిక మంత్రులు , సెంట్ర‌ల్ బ్యాంక్ గ‌వ‌ర్న‌ర్ల స‌మావేశం జ‌రిగింది. ఈ కీల‌క మీటింగ్ లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పాల్గొన్నారు. కీల‌క ప్ర‌సంగం చేశారు. ప్ర‌ధానంగా ప్ర‌పంచానికి స‌వాల్ విసురుతున్న స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం భార‌త దేశం ప్ర‌య‌త్నం చేస్తోద‌ని చెప్పారు నిర్మ‌లా సీతారామ‌న్(Nirmala Sitharaman). క‌ర్ణాట‌క రాజ‌ధాని బెంగళూరులో ఈ స‌ద‌స్సు జ‌రిగింది.

దీనికి మంత్రితో పాటు రిజ‌ర్వ్ బ్యాంక్ గ‌వ‌ర్న‌ర్ శ‌క్తి కాంత దాస కూడా హాజ‌రు కావ‌డం విశేషం. జి20 స‌భ్యులు ప్రైవేట్ క్రిప్టో క‌రెన్సీల‌పై నిషేధానికి మొగ్గు చూపుతున్నారా అన్న ప్ర‌శ్న‌కు ఆమె స‌మాధానం చెప్పారు. కేంద్ర బ్యాంకు నుండి బ‌య‌ట‌కు వ‌చ్చేది ఏదైనా క‌రెన్సీ కాద‌న్నారు. ఇదే భావ‌న‌తో చాలా మంది ఉన్నార‌ని తెలిపారు.

ఇదే స‌మ‌యంలో క్రిప్టో క‌రెన్సీకి మ‌ద్ద‌తు ఇచ్చే బ్లాక్ చెయిన్ టెక్నాల‌జీకి కూడా మ‌ద్ద‌తు ఇస్తార‌ని తెలిపారు.

Also Read : మోదీతో జ‌ర్మ‌నీ ఛాన్స‌ల‌ర్ భేటీ

Leave A Reply

Your Email Id will not be published!