Piyush Goyal : భారత్ సూపర్ పవర్ ఖాయం – గోయల్
ప్రపంచ ఆర్థిక రంగంలో కీలకం
Piyush Goyal : ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థకు వచ్చిన నష్టం ఏమీ లేదని అన్నారు కేంద్ర వాణిజ్యం, జౌళి శాఖ మంత్రి పీయూష్ గోయల్ . పనిలో పనిగా భారత్ సూపర్ పవర్ అవుతుందన్న నమ్మకం ఉందని జోష్యం చెప్పారు.
వచ్చే 25 ఏళ్లలో ఇండియాను ఎవరూ ఢీకొనే స్థితిలో లేరన్నారు. గ్లోబల్ లో తనకంటూ ఓ స్పెషాలిటీతో ముందుకు సాగుతుందన్నారు. ఢిల్లీలో లీడర్ షిప్ సదస్సులో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్(Piyush Goyal) పాల్గొని ప్రసంగించారు.
నిన్నటి దాకా భారత్ అంటే ఇతర దేశాలలో ముఖ్యంగా ప్రపంచ వ్యాప్తంగా చులకన భావం ఉండేదన్నారు. కానీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎప్పుడైతే ప్రధానిగా ఈ దేశానికి వచ్చారో ఆనాటి నుంచి నేటి దాకా సీన్ మారిందన్నారు. ప్రస్తుతం యావత్ ప్రపంచం ఇండియా వైపు చూస్తోందన్నారు.
ప్రపంచాన్ని విస్మయ పరిచేలా చేసి, నానా అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారిని సక్సెస్ ఫుల్ గా ఎదుర్కొన్నది ఒక్క భారత్ అని పేర్కొన్నారు గోయల్.
ప్రపంచంలోని ప్రముఖ దేశాలలో దేశం స్థానం గురించి సానుకూల చిత్రాన్ని చిత్రించే ప్రయత్నం చేశారు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి. ప్రస్తుతం ప్రపంచంలో..రాజకీయాలైనా లేదా వ్యాపార, వాణిజ్యమైనా చాలా ప్రాంతాల్లోని ప్రజలు భారత్ ను చూసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. భారతీయులందరి ఆలోచనా విధానంలో చాలా సానుకూలతను చూపుతోందన్నారు.
వ్యాపార, వాణిజ్య , తదితర రంగాలలో కీలకమైన పురోగతి జరగడం ఖాయమన్నారు పీయూష్ గోయల్. ప్రస్తుతం తాము దేనినైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నామని చెప్పారు.
Also Read : రాహుల్..ఠాక్రే’ దేశాన్ని పాలించే సమర్థులు