IndiGo: ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం ! ‘మేడే కాల్’తో విమానం సేఫ్ !
ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం ! ‘మేడే కాల్’తో విమానం సేఫ్ !
IndiGo : ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానానికి పెను ప్రమాదం తప్పింది. ‘మేడే కాల్’తో విమానం సురక్షితంగా బయటపడింది. గువహటి నుంచి చెన్నైకి వెళుతున్న విమానంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం…
గువహటి నుంచి చెన్నైకి ప్రయాణికులతో ఇండిగో (IndiGo) విమానం బయలుదేరింది. టేకాఫ్ అయిన కాసేపటికి అందులో ఇంధనం తక్కువగా ఉండడాన్ని పైలట్ గుర్తించారు. వెంటనే పైలట్ ఏటీసీకి ‘మేడే’ సందేశం పంపారు. తక్షణమే బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేశారు. దీనితో విమానానికి ప్రమాదం తప్పింది. ఈ ఘటన మూడు రోజుల క్రితం చోటు చేసుకోగా… తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్నల్లు తెలుస్తోంది.
IndiGo Flight Luckily Escape
మేడే కాల్ అనేది డిస్ట్రెస్ కాల్. అత్యవసర ప్రమాద పరిస్థితిని ఎదుర్కొంటున్నామనే విషయాన్ని రేడియో కమ్యూనికేషన్ ద్వారా సమీపంలోని ఏటీసీకి తెలియజేయడం కోసం దీన్ని వాడుతారు. ఆపదలో ఉన్నామని, తక్షణమే సాయం అవసరమని విజ్ఞప్తి చేసేందుకు ఉపయోగిస్తారు. కాగా.. ఇటీవల ఎయిరిండియా విమానం ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న విమానం కుప్పకూలింది. మొత్తం 242 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో అది ఓ భవనంపై కూలిపోయింది. వీరిలో 241 మంది ప్రాణాలు కోల్పోయారు.
Also Read : Ayesha Meera Case: ఆయేషా మీరా హత్య కేసులో ముగిసిన సీబీఐ విచారణ
