IndiGo: ముంబై విమానాశ్రయంలో ఇండిగో విమానానికి తప్పిన పెను ప్రమాదం

ముంబై విమానాశ్రయంలో ఇండిగో విమానానికి తప్పిన పెను ప్రమాదం

IndiGo : ముంబై విమానాశ్రయంలో ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది. బ్యాంకాక్ నుండి ముంబైకి వస్తున్న ఇండిగో ఎయిర్‌బస్ (A321) విమానం… ల్యాండింగ్‌ సమయంలో తోక భాగం రన్‌వేను తాకింది. అయితే, మళ్లీ గాల్లోకి లేచిన విమానం… రెండోసారి సురక్షితంగా ల్యాండ్‌ కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇండిగో (IndiGo) విమానయానసంస్థ ఈ ఘటనను ధ్రువీకరించింది.

IndiGo Flight Accident Missing

‘‘ఇండిగో ఎయిర్‌బస్‌ ఏ321 విమానం ముంబయి విమానాశ్రయంలో దిగేందుకు సిద్ధమైంది. అయితే… ప్రతికూల వాతావరణం కారణంగా ల్యాండ్‌ చేసే పరిస్థితి లేకపోవడంతో… రన్‌ వేపై తక్కువ ఎత్తులో ఉన్నప్పుడు పైలట్‌ దాన్ని మళ్లీ గాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే విమానం తోక భాగం రన్‌వేను తాకింది. రెండో ప్రయత్నంలో సురక్షితంగా దిగింది’’ అని ఇండిగో ప్రతినిధి తెలిపారు. అయితే, విమానం ఎక్కడినుంచి వచ్చింది?, ఎంతమంది ప్రయాణికులు ఉన్నారనే విషయాన్ని వెల్లడించలేదు.

ప్రయాణికులు, సిబ్బంది, విమాన భద్రత తమ ప్రాధాన్యమని ఇండిగో సంస్థ తెలిపింది. దీని కోసం అన్ని సేఫ్టీ ప్రొటోకాల్స్‌ పాటిస్తున్నట్లు వెల్లడించింది. ఆ విమానానికి అవసరమైన తనిఖీలు, మరమ్మతులు చేపడతామని, సంబంధిత క్లియరెన్సుల వచ్చిన అనంతరమే కార్యకలాపాలను పునఃప్రారంభిస్తామని తెలిపింది.

Also Read : Election Commission: ‘ఓట్ల చోరీ’ ఆరోపణలు చెక్‌ పెట్టేందుకు సిద్ధమైన ఈసీ ?

Leave A Reply

Your Email Id will not be published!