Infosys CEO : ఇన్ఫోసిస్ సిఇఓ కీల‌క కామెంట్స్

ఇంటి నుంచి ప‌నికి క్ల‌యింట్స్ నో

Infosys CEO : ఓ వైపు ఆర్థిక మాంద్యం దెబ్బ‌కు నానా తంటాలు ప‌డుతున్నాయి దిగ్గ‌జ సంస్థ‌లు. ఐటీ, ఫార్మా, లాజిస్టిక్, టెలికాం, ఎంట‌ర్ టైన్మెంట్ రంగాల‌న్నీ భారీ ఎత్తున కొలువుల‌కు కోత పెడుతున్నాయి. తాజాగా భార‌తీయ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్ , మేనేజింగ్ డైరెక్ట‌ర్ స‌లీల్ ప‌రేఖ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌మ కంపెనీకి సంబంధించి క్ల‌యింట్స్ సిబ్బంది, ఉద్యోగుల‌ను, టాప్ ఎగ్జిక్యూటివీల‌ను ఇంటి వ‌ద్ద నుండి కాకుండా ఆఫీసుల నుంచి ప‌ని చేయాల‌ని కోరుతున్నాయ‌ని ప‌రేఖ్ స్ప‌ష్టం చేశారు.

భ‌విష్య‌త్తులో కొత్త ప్రాజెక్టుల‌కు సంబంధించిన ప‌నులు , ట్రైనింగ్ కు సంబంధించి ఒక‌రి నుంచి మ‌రొక‌రు క‌నెక్ట్ కావాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు ఇన్ఫోసిస్ సిఇవో. ఏ కంపెనీ అయినా అభివృద్ది చెందాలంటే క్ల‌యింట్స్ ముఖ్య‌మ‌న్నారు. వాళ్లిచ్చే ప‌నుల‌తోనే త‌మ కంపెనీ ముందుకు వెళుతుంద‌ని పేర్కొన్నారు సలీల్ ప‌రేఖ్(Salil Parekh). త‌మ ఇన్ఫోసిస్ లో ఇప్ప‌టి దాకా 3 ల‌క్ష‌ల 40 వేల మంది ఉద్యోగులు వివిధ స్థాయిలలో ప‌ని చేస్తున్నార‌ని చెప్పారు.

ఇదిలా ఉండ‌గా ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా కంటే ముందు ఆఫీసుల‌కు వ‌చ్చే వాళ్ల‌ని క‌రోనా క‌ష్ట కాలంలో ఇంటి వ‌ద్ద నుండి ప‌ని చేసేందుకు వెసులుబాటు ఇచ్చిన‌ట్లు వెల్ల‌డించారు స‌లీల్ ప‌రేఖ్. ఉద్యోగుల‌కు ఇబ్బంది లేకుండా ఉండేందుకు గాను క్ల‌యింట్స్ చెప్పిన‌ట్లు వినాల్సి వ‌స్తోంద‌ని పేర్కొన్నారు.

Also Read : Jairam Ramesh Modi : అన్న భాగ్య‌కు కేంద్రం అడ్డుపుల్ల‌

 

Leave A Reply

Your Email Id will not be published!