Sonali Phogat : సోనాలీ ఫోగ‌ట్ శ‌రీరంపై గాయాలు

పోస్ట్ మార్ట‌మ్ రిపోర్టులో వెల్ల‌డి

Sonali Phogat : అంతా ఊహించిన‌ట్టుగానే హ‌ర్యానాకు బీజేపీ నాయ‌కురాలు, టిక్ టాక్ స్టార్ , యాంక‌ర్ గా పేరొందిన సోనాలీ ఫోగ‌ట్ అనుమానాస్ప‌ద రీతిలో గోవాలో మృతి చెందారు.

అయితే ఆమె స‌హాయ‌కుల‌తో గోవాకు బ‌య‌లు దేరింది. అక్క‌డ గుండె పోటుతో మ‌ర‌ణించిన‌ట్లు స‌మాచారం అందించారు. కాగా సోనాలీ ఫోగట్ మృతి పై అనుమానాలు ఉన్నాయ‌ని, ఆమె పూర్తి ఫిట్ నెస్ తో ఉంద‌ని, దీని వెనుక కుట్ర దాగి ఉందంటూ సోనాలీ ఫోగ‌ట్ కుటుంబీకులు, చెల్లెళ్లు ఆరోపించారు.

ఈ ఘ‌ట‌న‌పై తీవ్రంగా స్పందించారు గోవా సీఎం. ఆ రాష్ట్ర పోలీస్ బాస్ సార‌థ్యంలో సోనాలీ ఫోగ‌ట్(Sonali Phogat) కేసు విష‌యంపై ప‌రిశీలించారు. ఆమె పోస్ట్ మార్టం రిపోర్టు ను వెల్ల‌డించారు.

ఊహించ‌ని రీతిలో శ‌వ ప‌రీక్ష నివేదిక‌లో శ‌రీరంపై బ‌హుళ మొద్దు బారిన గాయాలు ఉన్నాయ‌ని పేర్కొంది. సోనాలీ ఫోగ‌ట్ గుండె పోటుతో మ‌ర‌ణించే అవ‌కాశాలు లేనే లేవంటూ పేర్కొన్నారు.

వారు వ్య‌క్తం చేసిన అనుమానాలు నిజం అయ్యేలా పోస్ట్ మార్టం రిపోర్ట్ రావ‌డం క‌ల‌క‌లం రేపింది. సోనాలీ ఫోగ‌ట్ ఇద్ద‌రు స‌హ‌చ‌రులు హ‌త్య చేసి అభియోగాలు మోపారంటూ కుటుంబీకులు ఆరోపించారు.

కాగా మ‌ర‌ణానికి సంబంధించిన విధానాన్ని ద‌ర్యాప్తు అధికారి నిర్దారించాల్సి ఉంద‌ని స‌మాచారం. సోనాలీ ఫోగ‌ట్(Sonali Phogat) గోవా వ‌చ్చిన స‌మ‌యంలో ఆమెతో ఉన్న వ్య‌క్తిగ‌త స‌హాయ‌కుడు సుధీర్ సాంగ్వాన్ , అత‌ని స్నేహితుడు సుఖ్వీంద‌ర్ వాసిపై గోవా పోలీసులు హ‌త్య కేసు న‌మోదు చేశారు.

త‌న సోద‌రిని సుధీర్ సాంగ్వాన్ , సుఖ్ వింద‌ర్ అత్యాచారం చేసి హ‌త్య‌కు పాల్ప‌డ్డారంటూ సోనాలీ ఫోగ‌ట్ సోద‌రుడు రింకూ ధాకా గోవా పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు.

Also Read : జార్ఖండ్ సీఎం సోరేన్ కు బిగ్ షాక్

Leave A Reply

Your Email Id will not be published!