INS Arnala: భారత నౌకాదళం అమ్ముల పొదిలో ‘ఐఎన్‌ఎస్ అర్నాల’
భారత నౌకాదళం అమ్ముల పొదిలో ‘ఐఎన్‌ఎస్ అర్నాల’
INS Arnala : భారత నౌకాదళం అమ్ముల పొదిలో మరో ‘జలాంతర్గామి వ్యతిరేక యుద్ధనౌక’ (Anti-Submarine Warfare Shallow Water Craft) చేరింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ‘ఐఎన్‌ఎస్ అర్నాల’ నౌకను … తూర్పు నావికాదళం (Eastern Naval Command) లోని విశాఖపట్నం డాక్ యార్డ్ లో రక్షణ శాఖ సిబ్బంది సమక్షంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్‌చౌహాన్ ప్రారంభించారు. ఈ ‘ఐఎన్‌ఎస్ అర్నాల’ నౌక ప్రారంభోత్సవంలో తూర్పు నావికాదళ కమాండింగ్-ఇన్-చీఫ్ ఫ్లాగ్ ఆఫీసర్, సీనియర్ నావికాదళ అధికారులు, ప్రముఖ పౌర ప్రముఖులు, మాజీ కమాండింగ్ అధికారులు, మరియు గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ & ఇంజనీర్స్ (GRSE) మరియు లార్సెన్ & టూబ్రో షిప్‌బిల్డింగ్ ప్రతినిధులు మరియు ఇతర అతిథితులు పాల్గొన్నారు.
INS Arnala Commissioned
అత్యాధునిక ASW ఆయుధాలు మరియు సెన్సార్ సూట్‌తో ప్యాక్ చేయబడిన పదహారు స్వదేశీంగా నిర్మించిన యాంటీ సబ్‌మెరైన్ షాలో వాటర్ క్రాఫ్ట్ లలో ‘ఐఎన్‌ఎస్ అర్నాల’ మొదటిది. 77 మీటర్ల పొడవు, 1490 టన్నుల బరువు కలిగి డీజిల్ ఇంజిన్-వాటర్ జెట్ కలయికతో నడిచే ఈ అతిపెద్ద భారతీయ నావికాదళ యుద్ధనౌకను కోల్‌కతాలో గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ & ఇంజనీర్స్ అనే రక్షణ ఉత్పత్తుల సంస్థ నిర్మించింది. ఈ తరహాలో మొత్తం 16 నౌకల తయారీకి భారత రక్షణ వ్యూహత్మక మండలి నిర్ణయించగా… ‘ఐఎన్‌ఎస్ అర్నాల (INS Arnala)’ తొలినౌక.
ఆత్మనిర్భర్ నినాదంతో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థల భాగస్వామ్యంతో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో దీనిని నిర్మించారు. శత్రుదేశాల జలాంతర్గాములను గుర్తించి తీర భద్రతను కాపాడుతుంది. హిందూ మహా సముద్ర (ఐవోఆర్) ప్రాంతంలో భద్రత పరంగా దీని సేవలు ఉపయోగపడనున్నాయి. ఉపరితల నిఘా, శోధన, సహాయ చర్యలకు దోహదపడనుంది. మహారాష్ట్రలోని ప్రసిద్ధ కోట పేరు ఈ నౌకకు పెట్టారు. విస్తృత శ్రేణి యాంటీ-సబ్‌మెరైన్ కార్యకలాపాల కోసం రూపొందించబడిన INS అర్నాలా సబ్-సర్ఫేస్ సర్వైలెన్స్ మరియు ఇంటర్‌డిక్షన్, సెర్చ్ మరియు రెస్క్యూ మిషన్లు, మరియు లో-ఇంటెన్సిటీ మారిటైమ్ ఆపరేషన్స్ (LIMO) నిర్వహించడానికి తయరుచేయబడింది.
ఈ సందర్భంగా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్‌చౌహాన్ మాట్లాడుతూ… ‘ఐఎన్‌ఎస్ అర్నాల (INS Arnala)’ భారతదేశ రక్షణ సామర్థ్యాన్ని బలోపేతం చేయడమే కాకుండా, స్వదేశీ డిజైన్, ఇంజనీరింగ్ మరియు తయారీ విజయాన్ని ప్రతిభింబిస్తోంది. ఈ నౌక నిర్మాణం ద్వారా భారత నావికాదళం “Buyer’s Navy” నుండి “Builder’s Navy” గా అద్భుతమైన పరివర్తనను చెందింది. ‘ఐఎన్‌ఎస్ అర్నాల’అనేది దేశం యొక్క బ్లూ వాటర్ యాస్పిరేషన్స్ (Blue Water aspirations) కు వెన్నుముఖగా నిలుస్తోంది. ఈ నౌక తయారీతో భారతదేశం నౌకానిర్మాణంలో ఒక బలీయమైన శక్తిగా ఉద్భవించింది. స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన యుద్ధనౌకలు ఇప్పుడు స్టెల్త్ టెక్నాలజీ నుండి ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సూట్ లు మరియు అధునాతన సెన్సార్ ల వరకు అత్యాధునిక స్వదేశీ-అభివృద్ధి వ్యవస్థలను కలిగి ఉన్నాయి. ‘ఐఎన్‌ఎస్ అర్నాల’ ద్వారా స్వదేశీ మార్గం ద్వారా వ్యూహాత్మక దృక్పథాన్ని స్పష్టమైన ఫలితాలుగా మార్చడంలో దృఢమైన నిబద్ధతకు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్… భారత నావికాదళాన్ని ప్రశంసించారు.
Also Read : Visakhapatnam: యోగాంద్ర వేడుకలకు ముస్తాబవుతున్న విశాఖ
