INS Brahmaputra: ఐఎన్‌ఎస్‌ బ్రహ్మపుత్రలో అగ్నిప్రమాదం !

ఐఎన్‌ఎస్‌ బ్రహ్మపుత్రలో అగ్నిప్రమాదం !

INS Brahmaputra: భారత నౌకా దళానికి చెందిన యుద్ధ నౌక ఐఎన్‌ఎస్‌ బ్రహ్మపుత్రలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ముంబయిలోని డాక్‌ యార్డులో మెయింటెనెన్స్ లో ఉండగా… ఈ నౌక నుండి ఆదివారం రాత్రి అగ్నికీలలు చెలరేగాయి. దీనితో అప్రమత్తమైన భారత నౌకాదళం అగ్నికిలలను ఆర్పే ప్రయత్నం చేసింది. అయితే ఈ ఘటనలో అప్పటికే ఓ జూనియర్‌ సెయిలర్‌ గల్లంతయ్యారు. దీనితో అతడి కోసం సహాయక బృందాలు గాలింపు చేపట్టినట్లు భారత నౌకాదళం తెలిపింది. మిగతా సిబ్బంది సురక్షితంగా ఉన్నట్లు పేర్కొంది. సోమవారం ఉదయానికల్లా మంటలను అదుపులోకి తెచ్చినట్లు తెలిపింది. ఈ ప్రమాదంలో నౌక ఓవైపు ఒరిగిపోయిందని… సరైన స్థితికి తెచ్చేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని వెల్లడించింది. దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు కొనసాగుతున్నట్లు నౌకాదళం ఓ ప్రకటనలో పేర్కొంది.

INS Brahmaputra Fire Incident

ఐఎన్‌ఎస్‌ బ్రహ్మపుత్రలో అగ్ని ప్రమాదం ఘటనకు సంబంధించిన వివరాలను నేవీ చీఫ్‌ అడ్మిరల్‌ దినేశ్‌ త్రిపాఠి రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌కు నివేదించారు. బ్రహ్మపుత్ర శ్రేణిలో స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన తొలి గైడెడ్‌ మిసైల్‌ యుద్ద నౌక ఇది. 2000 ఏప్రిల్‌లో దీన్ని సముద్ర జలాల్లోకి ప్రవేశపెట్టారు. ప్రస్తుతం మెయింటెనెన్స్ (మరమ్మత్తుల నిర్వహణ) కోసం ముంబయి డాగ్ యార్డులో ఉంటుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

Also Read : KTR : కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు ఇచ్చింది గుడ్డు సున్నా -కేటీఆర్

Leave A Reply

Your Email Id will not be published!