Polavaram Project: పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన అంతర్జాతీయ నిపుణులు !

పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన అంతర్జాతీయ నిపుణులు !

Polavaram Project: ఆంధ్రప్రదేశ్‌ జీవనాడి పోలవరం ప్రాజెక్టు(Polavaram Project)ను అంతర్జాతీయ జలవనరుల నిపుణులు పరిశీలించారు. అమెరికా, కెనడా నుంచి వచ్చిన నలుగురు నిపుణులు… ఆదివారం ఉదయం ప్రాజెక్టు వద్దకు చేరుకుని అక్కడి పరిసరాలను పరిశీలించి అధికారులతో మాట్లాడారు. అమెరికా నుంచి డేవిడ్ పి పాల్, గెయిన్ ఫ్రాంకో డి సిక్కో, కెనడా నుంచి రిచర్డ్ డానెల్లీ, సీన్ హించ్ బెర్గర్‌ హాజరయ్యారు.

Polavaram Project…

డయాఫ్రం వాల్, రెండు కాఫర్ డ్యాంలు, గైడ్ బండ్‌లను నిపుణులు పరిశీలించారు. అధికారులు ఇచ్చిన సమాచారం ఆధారంగా ప్రాజెక్టు డిజైన్ల నుంచి నేటి పరిస్థితి వరకు సమగ్ర అధ్యయనం చేయనున్నారు. నేటి నుంచి జులై 3వరకు ప్రాజెక్టు సైట్‌ లో పనులను నిపుణులు పరిశీలిస్తారు. అనంతరం కేంద్ర, రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థలతో కలిసి సమీక్ష నిర్వహించనున్నారు. గత 5 ఏళ్ల తప్పుడు నిర్ణయాల కారణంగా అసలు పోలవరంలో ఎంత నష్టం జరిగిందో కూడా చెప్పలేని స్థాయిలో ప్రస్తుత పరిస్థితులు నెలకొన్నాయని ఆరోపిస్తూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అంతర్జాతీయ నిపుణులను రంగంలోకి దింపింది.

ఐదేళ్ళ వైసీపీ ప్రభుత్వం హయాంలో పోలవరం ప్రాజెక్టు విధ్వంసానికి గురైయిందని సీఎం చంద్రబాబు ఆరోపిస్తూ ఇటీవల శ్వేతపత్రం విడుదల చేసారు. పోలవరం ప్రస్తుత దుస్థితికి కర్త, కర్మ, క్రియ జగనేనని శ్వేతపత్రం ద్వారా చంద్రబాబు విస్పష్టంగా ప్రకటించారు. దీనితో పోలవరం ప్రాజెక్టులో జరిగిన నష్టాన్ని అంచనావేయడంతో పాటు… ప్రాజెక్టులో లోపాలను సరిదిద్దడానికి అంతర్జాతీయ నిపుణులను రంగంలోనికి దించింది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ నిపుణులు పోలవరం ప్రాజెక్టును పరిశీలిస్తున్నారు.

Also Read : Wishes to Team India: టీమిండియాకు చంద్రబాబు, పవన్, జగన్ ల శుభాకాంక్షలు !

Leave A Reply

Your Email Id will not be published!