#KalkiRaja : నచ్చిన పాత్రలు చేస్తున్నా కల్కి రాజా
Interview with movie and TV actor Kalki Raja
Kalki Raja: తెలుగు టీవీ సీరియల్స్ లో తనకంటూ ఓ ప్రత్యేకత నిలుపుకొంటూ ఇటు సినిమాలలోనూ నచ్చిన పాత్రలు చేస్తున్న నటుడు కల్కి రాజా . ప్రస్తుతం జీ టీవిలో ప్రసారమవుతున్న గుండమ్మ కథ సీరియల్ లో లీడ్ పాత్ర పోషిస్తూ ప్రేక్షక లోకానికి మరింత చేరువైన కల్కి తన మనసులోని భావాలను పంచుకున్నారు. ఆ వివరాలు మీ కోసం ….
హలో కల్కి … ఇండస్ట్రీలో ఎలాంటి సపోర్ట్ లేకున్నా వచ్చి ఎలా నిలదొక్కుకున్నారు ?
అవును ఇక్కడ మద్దతుగా పలికే వారు లేరు… అయినా నాకు ఇష్టమైన రంగం కావటంతో ఓ వైపు ఉద్యోగం వెలగ బెడుతూనే దేవదాస్ కనకాల గారి ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లో 6 నెలల యాక్టింగ్ కోర్స్ లో చేరాను. ఎందరినో నటులుగా చేసిన దేవదాస్ గారు నాలో ఎదో ఏదో ఉందని, దానికి మరింత మెరుగు పెట్టాలని సూచించారు. అయన చెప్పిన ప్రతి మాట తూచా తప్పక పాటించా. ఆ క్రమంలోనే ఓ ఆడిషన్ కి ఫోటోలు పంపాను. ముంబై కి చెందిన నిర్మాణ సంస్థ నిర్మించే క్రాంతి సీరియల్ కోసం పిలుపు వచ్చింది. వెళ్ళగానే ఓ డైలాగ్ పేపర్ చేతిలో పెట్టి నీదైన స్టయిలీలో చెప్పు అన్నారు. అప్పటికి కనకాల చేరి రెండునెలలు అయ్యింది. ఈ రెండు నెలల అనుభవంతో చెప్పేశా, ఐతే నిర్మాత వచ్చి నీకూ 15 రోజులు అవకాశం ఇస్తా , ఇంకా బాగా చేయగలిగితే క్రాంతిలో నువ్వే హీరో అని చెప్పడం ఎప్పటికి మరిచిపోను. వెంటనే గురువుగారిని కల్సి ఛాన్స్ వచ్చిందని చెప్పా , కనకాల గారు నా తడుస్తూనే నన్ను మరింత సాన బట్టారు. అది నిర్మాతలకు తగ్గట్టు నేను తయారవ్వటంతో ఛాన్స్ అందుకున్నా , ఆలా నా నట ప్రయాణం ఆరంభమైంది.(Kalki Raja)
ఇప్పటి వరకు ఎన్ని సీరియల్స్ చేశారు?
చాలానే , జీ తెలుగులో చిన్నకోడలు, ముద్దు బిడ్డ, ఇప్పుడు గుండమ్మ కథ, అలాగే అమృతం ఫేమ్ గుణ్ణం గంగరాజు గారి సారధ్యంలో వచ్చిన అడగక ఇచ్చిన మనసు , స్వాతి చినుకులు ఇలా పలు సీరియల్స్ ఉన్నాయ్ , నటుడిగా నాకు సంతృప్తి కలిగేలా ఆ పాత్ర ఉంటే చేసెందుకు నే సిద్దమే ఎప్పుడూ
మరి సినీ అవకాశాలు రాలేదా ?
రాకపోవడమేంటండీ బాబు… శ్రీకాంత్ హీరోగా చేసిన మల్లిగాడు మ్యారేజ్ బ్యూరో సినిమాలో సెకండ్ లీడ్ రోల్ నాదే , అలాగే మాయమహల్ సినిమాలో విలన్ క్యారెక్టర్ చేశా. అలా వరుస అవకాశాలతో 15 సినిమాల వరకు చేశా,
సినిమాలు, సీరియల్స్ రెండింటినీ ఎలా బాలన్స్ చేస్తారు? ఇబ్బంది పడ్డారా ఎప్పుడైనా??
ఇబ్బందులంటే గుర్తొచ్చింది, టీవిలో హీరోగా కనిపించడం వల్ల తొందరగానే అవకాశాలను అందుకున్నాను. కృష్ణుడు కి వారసుడు సినిమాలో హీరో రోల్ దొరికింది. డిఫరెన్ట్ కథాంశం. దాదాపు 70% షూటింగ్ పూర్తైన దశలో నోట్ల రద్దు దేశవ్యాప్తంగా జరిగింది, అప్పటికి రాజీపడి ముగిద్దామని అనుకున్న, నిర్మాత అంగీకరించలేదు, ఎక్కడి డబ్బులు అక్కడ ఉండిపోవటం, కొత్త ఓట్లు అందక సినిమా నిలిచిపోయింది. తొలి సినిమా ఆగిపోవటం నాలో ఆందోళన పెరిగింది. అసలు సినిమాలలో మరిన్ని ఛాన్సులు పెరగాలంటే సీరియల్స్ వదులుకోమని ఓ పెద్దాయన ఇచ్చిన ఉచిత సలహా పాటించా , దీంతో వచ్చిన అవకాశాలు కాదనుకోవడంతో రెండేళ్లపాటు అటు సెరియల్స్ ఇటు సినిమాలు పోయాయి.. ఇక లాభం లేదని పించిన దశలో దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు గారిచ్చిన సూచనలతో కాల్షీట్స్ బాలన్స్ చేసుకొంటూ ముందుకు సాగా , ఇప్పుడు రెంటిలో చేస్తున్నా
ఇబ్బందుల సమయంలో ఇండస్ట్రీ నుంచి మీకు మద్దతుగా నిలచింది ఎవరు ?
ఉన్నారు, నా నడవడిక చూసి నాకు అమూల్య సలహాలు ఇచ్చిన నటుడు, నిర్మాత మెగా బ్రదర్ నాగబాబు గారు , వరున్ బాబు తో సమానంగా నన్ను చూస్తారాయన. ఇప్పటికీ నాకు అన్నింటా అయన గైడ్లైన్స్ చాలానే ఉంటుంది. ఓ విధంగా చెప్పాలంటే నాకు మా నాన్న తరువాత ఆయనే , నెగిటివ్, పోజిటివ్ ఏదైనా అతనితో పంచుకొంటా, అనేక విషయాలలో ఎన్నో ఎదురు దెబ్బలు తిన్న తిరిగి నిలదొక్కుకున్న ఆయన స్ఫూర్తి ఇస్తారు. వర్క్ మీద కమిట్మెంట్, కాన్ఫిడెన్స్ ఉండటంతో పాటు అప్రమత్తంగా ఉండటం నేర్చుకున్నది ఆయననుంచే. ఇవే నా ఎదుగుదలకు కారణమయ్యాయని చెప్పేందుకు సంశయించను .(Kalki Raja)
సినిమా లలో నచ్చిన నటుడు ఎవరు ?
ఇంకెవరు, పవెర్ స్టార్ పవన్ కళ్యాణ్ , చిన్నప్పటి నుంచి ఆతని సినిమాలు చూస్తూ పెరగటం వాల్లనేమో ఒక్కోసారి ఆ ప్రభావం నామీద పడుతుంది. సెట్లలో షూటింగ్ టైములో తెలియకుండానే ఆమూడ్లోకి వెళ్ళిపోయిన సందర్భాలున్నాయి. అలా అని మిగిలిన హీరోలు నచ్చరని కాదు , ఒక్కో విషయంలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్.
మీ జీవితానికి దగ్గర గా ఉన్న పాత్రలేవైనా చేశారా?
గుండమ్మ కథ లో ని క్యారెక్టర్, కుంకుమ పువ్వులో నే పోషించిన ఆనంద్ పాత్ర నా జీవన యానానికి దగ్గరగా ఉన్నవే. ముఖ్యం గా అందరితో సరదాగా జోకులేసుకొంటూ నిత్యం నవ్వుకొంటూ, ఆహ్లాదంగా ఉండేలా చూసుకొనే నాకు తగిన పాత్రలవి
భవిష్యత్ ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా?
ఎందుకు లేవు. త్వరలోనే నిర్మాతగా మారుతున్నా , ఇప్పటికే నా మిత్రుడు హీరోగా ఓ ప్రొడక్షన్ ప్లాన్ చేస్తున్నా. నిర్మాతల కష్టాలు దగ్గర నుంచి చూసిన వాడిని కనుక మరింత జాగ్రత్తలు తీసుకొంటాను. మనసులో అనుకున్నది అనుకున్నట్టు దృశ్య రూపం ఇచ్చుకునేందుకు , నష్టాలు, లాభాలు విషయం పక్కన పెడితే నా వల్ల 70 కుటుంబాలకు జీవనం లభిస్తుంది, ఈ ఏడాది చివరినాటికి మొత్తం అని సమకూర్చుకొని ఈ ప్రొడక్షన్ ఆరభించాలన్నది నా ప్రయత్నం.. ఐతే దీనికి దర్శకత్వ భాద్యతలు నేను స్వీకరించను.
ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంది. కుటుంబ నేపథ్యం ఏమిటి ?
చాలా , అది లేకుంటే ఇక్కడి వరకు ప్రయాణించగలనా? చెప్పండి. ఎక్కడో మారుమూల ప్రాంతంలో ధాన్యం వ్యాపారం చేసుకొనే నాన్న , ఆప్యాయంగా అందరితో కలివిడిగా ఉండే అమ్మ అదో ప్రపంచం. నా మీద నమ్మకం వారిచ్చిన ప్రోత్సాహం అంతా ఇంతా కాదు. ఇక పెళ్లయ్యాక నా భార్య సహకారం కూడా చాలా ఉంది. ఆమె ఓ వైపు హెచ్ ఆర్ గా భాద్యతలు నిర్వహిస్తూనే , నాకు కావాల్సిన పనులు చక్కబెడుతూ సహకరిస్తుంది, ఇక 4 ఏళ్ల కొడుకు. ఇప్పుడు వాడితోనే సందడి అంతా
ఆంటే వారసుడు రెడీ అన్నమాట
ఆలా అని చెప్పలేను, నన్ను మించిన చలాకి వాడిది, ముదురు అని అంటాం కదా వాడు ఆలానే ఉన్నాడు. ఫాస్ట్ జెనరేషన్. ఏంచెప్పినా యిట్టె పసిగట్టే నైజం వాడిది. మీరన్నట్టు ఆ మాదే ఓ సీరియల్లో ఇలాంటి క్యారెక్టర్ కోసం వెతుకుతూ, వేడిని అడిషన్ కు తెమ్మన్నారు. వాళ్ళేం చెప్పినా గడగడా చెప్పేసి, చకచకా చేసేసి అంరినీ ఆశ్చర్య పరిచాడు, కానీ ఏజ్ గ్రూప్ సరిపోకపోవటం తో నటించలేదు. అన్నింటి కన్నా ముంచు వాడి చదువు మాకు చాలా ముఖ్యం . ఇక భవిష్యత్ లో వాడేం కావాలన్నది వాడే నిర్ణయించుకొనేలా చూస్తా…
ఇంటర్వ్యూ : ఎం. రామ్ గోపాల్
No comment allowed please