IOA Forms Committee : బ్రిజ్ భూషణ్ పై విచారణకు కమిటీ
ఏర్పాటు చేసిన భారత ఒలింపిక్ సంఘం
IOA Forms Committee : మీటూ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఉత్తరప్రదేశ్ కు చెందిన భారతీయ జనతా పార్టీకి చెందిన ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్. మనోడు భారత రెజ్లర్స్ సమాఖ్య (డబ్ల్యుఎఫ్ఐ) చీఫ్ గా ఉన్నారు. గత కొంత కాలంగా తానే సుప్రీం అంటూ కొనసాగిస్తూ వస్తున్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉండడంతో తనకు తిరుగే లేదని విర్ర వీగుతూ వచ్చారు.
ఆపై మహిళా రెజ్లర్లను టార్గెట్ చేశాడు. అక్కడితో ఆగలేదు ఏకంగా లక్నోలో తన స్వంత నివాసంలోనే రెజ్లర్లకు ట్రైనింగ్ క్యాంప్ ఉండేలా చేశాడు. ఆపై 12 మందికి పైగా మహిళ రెజ్లర్లను లైంగికంగా వేధింపులకు గురి చేశాడు. ఈ విషయాన్ని భారత దేశానికి చెందిన ప్రముఖ మహిళా రెజ్లర్లు సంచలన ఆరోపణలు చేశారు.
ఆపై ప్రధానికి, కేంద్ర క్రీడా శాఖ మంత్రికి లేఖలు రాశారు. అయినా స్పందించ లేదు. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో 30 మందికి పైగా మహిళా రెజ్లర్లు దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపట్టారు. శనివారం నాటితో నాలుగో రోజుకు చేరుకుంది వీరి నిరసన. స్పందించిన కేంద్రం భారత ఎన్నికల సంఘం చీఫ్ పీటీ ఉషను ఆదేశించింది పరిస్థితిని చక్కదిద్దమని. ఇప్పటికే పీటీ ఉషకు కూడా రెజ్లర్లు లేఖ రాశారు.
ఈ మొత్తం వ్యవహారంపై ఏడుగురితో విచారణ కమిటీని ఏర్పాటు చేసింది ఐవోఏ(IOA Forms Committee). దీనికి మేరీకోమ్ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీలో యోగేశ్వర్ దత్ , డోలా బెనర్జీ, సహదేవ్ యాదవ్ , అలక్ నందా అశోక్ , నీలాంజన్ భట్టాచార్య ఉన్నారు. ఇదిలా ఉండగా బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ మాత్రం తాను దిగే ప్రసక్తి లేదంటున్నారు.
Also Read : ముదిరిన వివాదం రెజ్లర్ల ఆగ్రహం