IPL 2023 Un Sold Players : ఆ ఆటగాళ్లు అమ్ముడు పోలేదు
స్టార్ ప్లేయర్లకు కోలుకోలని బిగ్ షాక్
IPL 2023 Un Sold Players : వచ్చే ఏడాదిలో జరిగే ఇండియన్ ప్రిమీయర్ లీగ్ (ఐపీఎల్ ) రిచ్ లీగ్ కు సంబంధించి కేరళ లోని కొచ్చిలో నిర్వహించిన మినీ వేలం పాట ముగిసింది. ఈ వేలం పాటలో 87 స్లాట్స్ కు సంబంధించి మొత్తం 405 మంది ఆటగాళ్లను ఎంపిక చేసింది బీసీసీఐ. ఇక ఈ మినీ వేలం పాటలో సామ్ కరన్ చరిత్ర సృష్టించాడు. ఏకంగా రూ. 18.50 కోట్లకు పంజాబ్ కింగ్స్ ఎలెవన్ కొనుగోలు చేసింది. ఇదే అత్యధిక ధర కావడం విశేషం.
ఆ తర్వాత ఆసిస్ ఆల్ రౌండర్ కామెరూన్ ను రూ. 17 కోట్లకు కైవసం చేసుకుంది ముంబై ఇండియన్స్ . ఇప్పటి దాకా 32 మంది ఆటగాళ్లను ఎంపిక చేసుకున్నాయి ఫ్రాంచైజీలు మొత్తం రూ. 132 కోట్లు ఖర్చు చేశాయి. ఇందులో 14 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నాయి. ఇక 35 మందిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపక పోవడం విశేషం.
ఇక అమ్ముడు పోని టాప్ ప్లేయర్లలో జో రూట్ , రిలో రోసా, షకీబ్ అల్ హసన్, కుశాల్ మెండీస్ , టామ్ బాంటన్ , ఎస్. ముదీన్ , అన్ మోల్ ప్రీత్ , మురుగన్ అశ్విన్ , ఇజారుల్లా నవీద్ ఉన్నారు. వీరితో పాటు హిమత్ సింగ్ , కున్నుమల్ , ఖజూరియా, అకీల్ హూసీన్ , తబ్రీజ్ షంసీ , ఆడమ్ జంపా , శ్రేయస్ గోపాల్ , చింతల్ గాంధీ, నవీద్ ఉన్నారు.
ఇదిలా ఉండగా ఇండియన్ ప్రిమీయర్ లీగ్ లలో టాప్ ప్రదర్శన చేపట్టిన ఆటగాళ్లను(IPL 2023 Un Sold Players) పక్కన పెట్టడం విస్తు పోయేలా చేసింది క్రికెట్ అభిమానులను. అత్యంత తక్కువ ఖర్చుకే ఆటగాళ్లను తీసుకునే ముంబై ఇండియన్స్ ఏకంగా 17 కోట్లు వెచ్చించడం ఆశ్చర్యం కలిగించింది.
Also Read : గెలుపు గుర్రాలపై లక్నో నజర్