Iraj Ilahi : ఒత్తిళ్ల‌ను త‌ట్టుకునే స్థితిలో భార‌త్

కీల‌క వ్యాఖ్య‌లు చేసిన ఇరాన్

Iraj Ilahi : ఇరాన్ కీల‌క వ్యాఖ్య‌లు చేసింది భార‌త దేశంపై. ప‌శ్చిమ దేశాల ఒత్తిళ్ల‌ను త‌ట్టుకునే శ‌క్తి భార‌త్ కు ఉంద‌ని స్ప‌ష్టం చేశారు ఇరాన్ రాయ‌బారి. ఇరాజ్ ఎలాహి(Iraj Ilahi) . ర‌ష్యా నుండి చ‌మురు కొనుగోలు చేయ కూడ‌ద‌నే ఒత్తిడికి భార‌త్ ప్ర‌తిఘ‌ట‌న‌ను ఈ సంద‌ర్భంగా ప్ర‌స్తావించారు. ఇటువంటి చ‌ర్య భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు ప్ర‌యోజ‌నం చేకూరుస్తుంద‌న్నారు. శుక్ర‌వారం న్యూఢిల్లీలో ఇరాన్ రాయ‌బారి కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

ఇదిలా ఉండ‌గా క‌నెక్టివిటీని పెంచేందుకు చాబ‌హార్ పోర్ట్ ను భార‌త్ ,ఇరాన్ ,ఆఫ్గ‌నిస్తాన్ అభివృద్ది చేస్తున్నాయి. ఈ ప్రాజెక్టును త్వ‌రిత‌గ‌తిన పూర్తి చేయాల‌ని, దీని వ‌ల్ల ఇరు దేశాల‌కు ప్ర‌యోజ‌నం చేకూరుతుంద‌న్నారు ఇరాజ్ ఎలాహి(Iraj Ilahi) . ఉక్రెయిన్ సంక్షోభం నెల‌కొన్న త‌రుణంలో ర‌ష్యా నుండి పెట్రోలియం ఉత్ప‌త్తుల సేక‌ర‌ణ‌ను కొసాగించ‌కుండా పాశ్చాత్య శ‌క్తుల ఒత్తిడికి భార‌త్ లొంగ లేద‌న్నారు. ఇది ఒక ర‌కంగా భార‌త దేశానికి ఉన్న బ‌ల‌మైన శ‌క్తిని తెలియ చేస్తుంద‌న్నారు ఇరాజ్ ఎలాహి.

ఇరాన్ నుండి భార‌త దేశం ముడి చ‌మురు దిగుమ‌తిని పునః ప్రారంభించాల‌ని కోరారు. మ‌రో వైపు భార‌త దేశం, అనేక ఇత‌ర దేశాల‌కు ఆంక్ష‌ల మిన‌హాయింపుల‌ను అమెరికా కొన‌సాగించేందుకు ఇష్ట ప‌డ‌లేదు. దీంతో ఇరాన్ నుండి ముడి చ‌మురు సేక‌ర‌ణ‌ను భార‌త దేశం నిలిపి వేసింది. చ‌బ‌హార్ పోర్టును కేవ‌లం ఆర్థిక కోణం నుండి మాత్ర‌మే కాకుండా వ్యూహాత్మ‌క భాగ‌స్వామిగా ప‌రిగ‌ణించాల‌ని సూచించారు ఇరాజ్ ఇలాహీ(Iraj Ilahi) . ప్ర‌స్తుతం ఆయ‌న చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి.

Also Read : టీసీఎస్ సిఇఓగా కృతివాస‌న్

Leave A Reply

Your Email Id will not be published!