Salman Rushdie Awarded : రష్దీపై దాడి చేసిన వ్యక్తికి నజరానా
ఆయన బతికి ఉన్నా లేనట్టేనని కామెంట్
Salman Rushdie Awarded : ది శాటనిక్ వర్సెస్ రచయిత సల్మాన్ రష్డీపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది ఇరాన్. అమెరికాలోని న్యూ జెర్సీ వేదికగా ప్రసంగిస్తున్న సమయంలో రష్డీపై 24 ఏళ్ల షియా ముస్లిం అమెరికన్ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో సల్మాన్ రష్డీ(Salman Rushdie) అక్కడికక్కడే కుప్ప కూలాడు. ఈ ఘటనలో సల్మాన్ రష్డీ ఒక కన్ను , చేతిని కోల్పోయాడు. ప్రపంచ వ్యాప్తంగా రష్డీపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. కవులు, కళాకారులు, రచయితలు, గాయనీ గాయకులు, ప్రజాస్వామిక వాదులు సైతం ఈ చర్యను తప్పు పట్టారు.
ఇది కళపై జరిగిన దాడిగా పేర్కొన్నారు. ఇదిలా ఉండగా సల్మాన్ రష్డీకి 75 ఏళ్లు. ఆయన ప్రస్తుతం రాసే పనిలో ఉన్నాడు. ప్రస్తుతం భయం భయంగా బతుకుతున్నాడు. ఆయనకు పూర్తి భద్రతను కల్పించారు. ఈ తరుణంలో ఒక కన్ను, చేతిని కోల్పోయి నిస్తేజంగా బతుకుతున్న సల్మాన్ రష్డీపై మరోసారి షాకింగ్ కామెంట్స్ చేసింది ఇరాన్(Salman Rushdie Awarded). ఇప్పటికే ఆయనపై ఫత్వా జారీ చేసింది. ఈ సందర్భంగా ఇరాన్ ఫౌండేషన్ రివార్డ్ అటాకర్ మండిపడింది.
ఆయన బతికి ఉన్నా చచ్చినట్టేనని ప్రకటించింది. కాగా సల్మాన్ రష్డీ ఎవరో కాదు ఆయన భారత దేశానికి చెందిన వ్యక్తి. భారత దేశంలో ముస్లిం కాశ్మీరీ కుటుంబంలో పుట్టారు. దాడి చేసిన వ్యక్తిని ప్రశంసించింది. అతడికి 1,000 చదరపు మీటర్ల వ్యవసాయ భూమిని బహుమతిగా ఇవ్వనున్నట్లు స్టేట్ టీవీ మంగళవారం తన టెలిగ్రామ్ ఛానల్ లో స్పష్టం చేసింది.
ఆనాటి ఇరాన్ చీఫ్ ఖొమేనీ ఫత్వా జారీ చేసిన 33 ఏళ్ల తర్వాత ఈ దాడి జరిగింది.
Also Read : ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ పై హై డ్రామా