Iran: భారత్‌ కోసం గగనతలాన్ని తెరచిన ఇరాన్‌ ! స్వదేశానికి చేరుకున్న 1000 మంది విద్యార్థులు !

భారత్‌ కోసం గగనతలాన్ని తెరచిన ఇరాన్‌ ! స్వదేశానికి చేరుకున్న 1000 మంది విద్యార్థులు !

Iran : ఇజ్రాయెల్‌-ఇరాన్‌ ల మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకు తీవ్రమవుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇటీవల తన గగనతలాన్ని మూసివేసిన ఇరాన్‌.. భారత్‌ కోసం ప్రత్యేకంగా మినహాయింపు ఇచ్చేందుకు సిద్ధమైంది. దీనితో ఇరాన్‌ లో చిక్కుకుపోయిన దాదాపు 1000 మంది భారతీయులు కొన్ని గంటల్లో భారత్‌కు చేరుకోనున్నట్లు సమాచారం. ‘ఆపరేషన్‌ సింధు’ లో భాగంగా ప్రత్యేక విమానాల్లో వీరు స్వదేశానికి రానున్నారు.

Iran Opens

ఆపరేషన్‌ సింధులో భాగంగా ఇరాన్‌ (Iran) లోని పలు నగరాల నుంచి ప్రత్యేక విమానాలు భారత్‌కు రానున్నట్లు తెలుస్తోంది. తొలి విమానం శుక్రవారం రాత్రి 11 గంటలకు దిల్లీ చేరుకోగా… మరో రెండు విమానాలు శనివారం దిగనున్నట్లు సమాచారం. అయితే, దీనికి ముందు ఇరాన్‌ నుంచి ఇప్పటికే 110 మంది విద్యార్థులు దిల్లీకి చేరుకున్నప్పటికీ వీరు తొలుత ఆర్మేనియా… అక్కడ నుంచి భారత్‌ కు వచ్చారు.

వారం క్రితం ఇజ్రాయెల్‌ చేసిన మెరుపు దాడులతో ఇరాన్‌లోని అనేక స్థావరాలు ధ్వంసమయ్యాయి. అనంతరం ఇజ్రాయెల్‌పై క్షిపణి, డ్రోన్‌లతో టెహ్రాన్‌ ప్రతిదాడులకు దిగింది. ఈ నేపథ్యంలోనే తన గగనతలాన్ని మూసివేయడంతో అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిచిపోయాయి. తాజాగా భారతీయ విద్యార్థులను తరలించేందుకు ఇరాన్‌ ప్రత్యేకంగా మినహాయింపు ఇవ్వడంతో తరలింపు ప్రక్రియ సులభం కానుంది. ఇదిలాఉంటే, ఇరాన్‌లో దాదాపు 4వేల మంది భారతీయులు ఉండగా… అందులో 2వేల మంది విద్యార్థులేనని సమాచారం.

Also Read : IndiGo: ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం ! ‘మేడే కాల్‌’తో విమానం సేఫ్‌ !

Leave A Reply

Your Email Id will not be published!