Iran President : హిజాబ్ వ్యతిరేక ప్రదర్శనలపై గుస్సా
ఇరన్ దేశ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ
Iran President : హిజాబ్ వ్యతిరేక నిరసనలు మిన్నంటాయి ఇరాన్ లో. దీనిపై తీవ్రంగా స్పందించారు ఆ దేశ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ(Iran President). మహ్సా అమినీ మరణం దేశంలో తీవ్ర అల్లర్లకు, ఆందోళనలకు కారణమైంది. ఆమె మరణంపై దేశం మొత్తం శోకసంద్రంలో మునిగి పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ఫోరెన్సిక్ , న్యాయ వ్యవస్థ నిపుణులు త్వరలో తుది నివేదికను అందజేస్తారని వెల్లడించారు.
కానీ నిరసనలు తెలియ చేయడం వల్ల ఒరిగేది ఏమీ ఉండదన్నారు రైసీ. ఇందుకు సంబంధించి రెడ్ లైన్ గీశారు. చట్టాన్ని ఉల్లంఘించి గందరగోళం సృష్టించేందుకు ఎవరికీ అనుమతి లేదన్నారు. దేశ వ్యాప్తంగా నిరసనలు ఊపందుకున్నాయి. ఈ తరుణంలో దేశ అధ్యక్షుడు రైసీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
అల్లర్లలో పాల్గొన్న వారితో నిర్ణయాత్మకంగా వ్యవహరించాలని, ప్రజల అభిప్రాయాలను తాము కూడా పరిగణలోకి తీసుకుంటున్నామని ఇబ్రహీం రైసీ స్పష్టం చేశారు. ప్రజల భద్రత అనేది ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ ప్రాథమిక బాధ్యత. అయితే ఎవరైనా సరే ఇరాన్ లో నివసిస్తున్న వారంతా దేశానికి సంబంధించిన నియమాలను పాటించాల్సిందేనంటూ స్పష్టం చేశారు.
కాగా దీనిని ఆసరాగా తీసుకుని చట్టాన్ని ఉల్లంఘించేందుకు , గందరగోళం కలిగించేందుకు ఎవరూ అనుమతించబడరని పేర్కొన్నారు. అమినీ అనే 22 ఏళ్ల కుర్దిష్ మహిళ సెప్టెంబర్ 16న మరణించింది.
ఆమె సాధారణ దుస్తులు ధరించడంపై అరెస్ట్ అయ్యింది. ఆ తర్వాత అనుమానాస్పద రీతిలో మరణించింది. దీనిపై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చోటు చేసుకుంది. మహిళలు ధిక్కరిస్తూ వారి తలపై కండువాలు కాల్చారు. వారి జుట్టును కత్తిరించుకున్నారు.
Also Read : భారత త్రివిధ దళాధిపతిగా అనిల్ చౌహాన్