IRCTC: జనరల్ క్లాస్ ప్రయాణీకులకు భారతీయ రైల్వే శుభవార్త
జనరల్ క్లాస్ ప్రయాణీకులకు భారతీయ రైల్వే శుభవార్త
IRCTC : ట్రైన్ లో జనరల్ కోచ్ లో ప్రయాణించే వారికి ఆహారం విషయమై చాలా ఇబ్బందులు ఉండేవి. కానీ, ఇకపై అలాంటి ఇబ్బందులు ఉండవు. భారతీయ రైల్వే శాఖ కొత్తగా ఏర్పాటు చేసిన సర్వీస్‌తో జనరల్ కోచ్ ప్రయాణికులకు మంచి నాణ్యత గల ఆహారం, తాగునీరు అందుబాటులో ఉండనుంది. ఈ కొత్త పథకం ద్వారా జనరల్ క్లాస్‌లో ప్రయాణించే వారు సీటు వదిలి ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేకుండా భోజనం నేరుగా వారి సీటు దగ్గరే అందిస్తారు.
IRCTC – రూ.80కే భోజనం
ఈ ఆహారం అదే రైల్లోని ఏసీ కోచ్ ప్రయాణికులకు ఇచ్చే భోజనంతో సమానంగా ఉంటుంది. కేవలం రూ.80కే మంచి నాణ్యత గల ఆహారం అందుబాటులో ఉంటుంది. అన్నం, పప్పు, ఒక కర్రీ, రొట్టె, ఊరగాయ… ఇవన్నీ నాణ్యమైన ఫుడ్ బాక్స్‌లో ప్యాక్ చేసి అందిస్తారు. అంతేకాకుండా.. ఒక చెంచా, నాప్‌కిన్ వంటివీ ఈ ప్యాకింగ్‌లో ఉంటాయి.
ప్రస్తుతం న్యూఢిల్లీ స్టేషన్ లో జనరల్ క్లాస్ ప్రయాణికులకు ప్రత్యేకంగా టేబుళ్లు ఏర్పాటు చేశారు. వారు కోచ్‌లో నిలబడి తినాల్సిన అవసరం లేకుండా కూర్చొని తినొచ్చు. మరికొన్ని ప్రధాన స్టేషన్లు… వారణాసి, గోరఖ్‌పూర్, లక్నోల్లో కూడా ఈ సౌకర్యం త్వరలో అందుబాటులోకి రానుంది. ప్రయాణికులకు సౌకర్యం కలిగించే ఈ కొత్త విధానం వల్ల ఐఆర్‌సీటీసీ (IRCTC) పై ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ప్రయాణికులు ఆహారం కోసం ఎలాంటి ఇబ్బందీ పడకుండా హ్యాపీగా జనరల్ క్లాస్‌లో ప్రయాణించవచ్చని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : Jagdeep Dhankhar: ఉప రాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖడ్‌కు వచ్చే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏమిటో తెలుసా ?
