Ishant Sharma Shami : షమీ మ్యాచ్ ఫిక్సింగ్ పై శర్మ కామెంట్
అతడు నిజమైన భారతీయుడు
Ishant Sharma Shami : క్రికెట్ రంగం విస్తరించే కొద్దీ ఫిక్సింగ్ భూతం వెంటాడుతూనే ఉంది. ఇప్పటికే పలువురిపై ఆరోపణలు వచ్చినా అవి నిరాధారమైనవని తేలింది. మరికొందరిపై వేటు కూడా పడింది. ఇటీవలే ఐసీసీ ముగ్గురు పాకిస్తాన్ క్రికెటర్లపై నిషేధం కూడా విధించింది.
తాజాగా భారత క్రికెట్ లో కీలకమైన పేసర్ గా పేరొందిన మహమ్మద్ షమీపై మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడినట్లు విమర్శలు వచ్చాయి. దీనిపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) విచారణకు కూడా ఆదేశించింది. ఈ సందర్భంగా విచారణ కమిటీ పలువురిని విచారించింది.
అతడితో సన్నిహితంగా ఉన్న వాళ్లను, క్రికెట్ జట్టు పరంగా ఆడుతున్న ప్లేయర్లను, రూమ్ మేట్స్ ను ప్రతి ఒక్కరినీ జల్లెడ పట్టింది. ఈ సందర్భంగా మహమ్మద్ షమీ గురించిన మ్యాచ్ ఫిక్సింగ్ పై తనను కూడా విచారణ కమిటీ సంప్రదించిందని స్పష్టం చేశాడు ప్రముఖ భారత పేసర్ ఇషాంత్ శర్మ.
ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశాడు. అతడు అద్భుతమైన బౌలర్. కానీ మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడేంత దౌర్భాగ్యం పట్టలేదని తాను నమ్ముతున్నట్లు తెలిపాడు. 200 శాతం షమీ అలాంటి వాడు కాదని తాను చెప్పానని పేర్కొన్నాడు. అయితే మహమ్మద్ షమీకి ముందు నుంచీ వ్యక్తిగతంగా తీవ్ర ఇబ్బందులు ఉన్నాయని వాపోయాడు.
గతంలో డి పోయిన భార్య హసిన్ జహాన్ నుంచి ఒత్తిడికి లోనయ్యాడని ఆ విషయం తనకు తెలుసని చెప్పాడు ఇషాంత్ శర్మ(Ishant Sharma Shami). ఆమె కూడా షమీ మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడినట్లు ఆరోపించింది. వాటన్నింటి నుంచి గట్టెక్కాడు మహమ్మద్ షమీ. విచారణ ముగిసింది..షమీకి క్లీన్ చిట్ ఇచ్చింది.
Also Read : బంగ్లాకు షాక్ శ్రీలంక ఝలక్