Raja Krishnamoorthi : ఐఎస్ఐ నన్ను శత్రువుగా పరిగణిస్తోంది
రాజా కృష్ణమూర్తి షాకింగ్ కామెంట్స్
Raja Krishnamoorthi : భారతీయ అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి(Raja Krishnamoorthi) సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ కు చెందిన గూఢచారి సంస్థ (ఐఎస్ఐ) తనను శత్రువుగా పరిగణిస్తోందంటూ ఆరోపించారు.
తాను గనుక గెలిస్తే అమెరికా, భారత దేశం మధ్య వ్యూహాత్మక సంబంధాలకు మద్దతు ఇస్తూనే ఉంటుందన్నారు. ఈ మేరకు భారతీయ, అమెరికన్ సమూహానికి హామీ ఇచ్చారు.
తద్వారా ఈ స్నేహం పసిఫిక్ లో దాని ఆశయాల నుండి చైనాను నిరోధించగలదన్నారు రాజా కృష్ణమూర్తి. రాబోయే ఎన్నికల సందర్భంగా ఇప్పటి నుంచే తన ప్రచారాన్ని ప్రారంభించారు.
దక్షిణాసియా దేశంలోని రాడికల్స్ పై తాను పోటీలో ఉన్నందుకు ఐఎస్ఐ తనను శత్రువుగా భావిస్తోందని మండిపడ్డారు. ఇల్లినాయిస్ కు చెందిన డెమోక్రటిక్ పార్టీ శాసనసభ్యుడు ,
బోస్టన్ లో యుఎస్ ఇండియా సెక్యూరిటీ కౌన్సిల్ (యుఎస్ ఐఎస్ఎసీ) ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఇదిలా ఉండగా ప్రముఖ భారతీయ అమెరికన్ ఆర్. వి. కపూర్ నివాసంలో నిర్వహించిన నిధుల సేకరణ సందర్భంగా నిధుల సేకరణ సందర్భంగా సభ్యులను ఉద్దేశించి ప్రసంగించారు రాజా కృష్ణమూర్తి(Raja Krishnamoorthi).
తాను అన్ని మతాలను గౌరవిస్తానని, ఏ రంగు, జాతి లేదా మతంతో ఎప్పుడూ వివక్ష చూపనని పునరుద్దాటించారు. తాను గెలిస్తే అమెరికా, భారత దేశాల మధ్య మరింత బంధం బలపడేలా చేయగలదన్న విశ్వాసం వ్యక్తం చేశారు.
ఈ కీలక సమావేశంలో విక్రమ్ రాజ్యదక్ష, దినేష్ పటేల్ , అభిషేక్ సింగ్ , అమర్ సాహ్నీ, దీపికా సాహ్నీ, డాక్టర్ రాజ్ రైనాతో సహా పలువురు ప్రముఖ భారతీయ అమెరికన్లు హాజరయ్యారు.
Also Read : రష్యాను ఒప్పించాలంటే మోదీనే బెటర్