Israel Laser Weapon : లేజర్ టెక్నాలజీ వెపన్స్ తో ప్రపంచాన్ని వణికిస్తున్న ఇజ్రాయెల్

లేజర్ ఆయుధంతో శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది...

Israel Laser Weapon : ప్రస్తుత కాలంలో యుద్ధ రీతుల్లో చాలా వేగంగా మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు వార్ అంటే ఒక దేశ సైన్యం మరో దేశం మీద దాడి చేసేది. కానీ అత్యాధునిక డ్రోన్ల రాకతో యుద్ధరీతుల్లో అనూహ్య మార్పులు వస్తున్నాయి. ఇప్పుడు ఎక్కువగా గగనతలంలోనే వార్స్ జరుగుతున్నాయి. డ్రోన్లు, మిసైళ్లతో దాడులకు దిగడం విపరీతంగా పెరిగింది. ఈ రకమైన అటాక్స్‌ను తిప్పికొట్టేందుకు సమర్థవంతమైన రక్షణ కవచాలను సిద్ధం చేసుకునే పనిలో పడ్డాయి ప్రపంచ దేశాలు. అయితే వార్ టెక్నాలజీలో ఎప్పుడూ ముందంజలో ఉండే ఇజ్రాయెల్(Israel).. ఈ విషయంలోనూ అందర్నీ దాటేసింది. అద్భుతమైన కొత్త లేజర్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది. లేజర్ ఆయుధంతో శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది.

Latest Israel Laser Weapon

హెజ్బొల్లా మిలిటెంట్లతో ఘర్షణలో కొత్త లేజర్ వ్యవస్థను వినియోగించామని ఇజ్రాయెల్(Israel) డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) తెలిపింది. దీన్ని తమ దేశానికి చెందిన రఫేల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్ సంస్థ తయారు చేసిందని వెల్లడించింది. ఈ ఐరన్ బీమ్ వ్యవస్థలో తక్కువ శక్తి కలిగిన లైట్ షీల్డ్ అనే ఆయుధాన్ని వాడి డ్రోన్లను కూల్చేశామని ఇజ్రాయెల్ వెల్లడించింది. ఈ వెపన్ 30 కిలోవాట్ శక్తితో పని చేస్తుందని పేర్కొంది. ఘర్షణల సమయంలో హెజ్బొల్లా తమపై తీవ్ర దాడులకు తెగబడిందని.. ఏకంగా 300కి పైగా పేలుడు పదార్థాలతో నిండిన డ్రోన్లను ప్రయోగించిందని స్పష్టం చేసింది. అయితే అన్ని డ్రోన్లను తమ కొత్త ఐరన్ బీమ్ లేజర్ ఇంటర్‌సెప్టర్ సక్సెస్‌ఫుల్‌గా అడ్డుకుందని ఇజ్రాయెల్ చెప్పుకొచ్చింది.

హెజ్బొల్లా ప్రయోగించిన డ్రోన్లను విజయవంతంగా అడ్డుకొని పౌరుల ప్రాణాలు కాపాడామని ఇజ్రాయెల్ తెలిపింది. ఐరన్ బీమ్ లేజర్ ఆయుధం అద్భుతంగా పనిచేసిందని.. దేశ ఆస్తులను కూడా రక్షించిందని ఐడీఎఫ్‌ పొగడ్తల వర్షం కురిపించింది. ఒక్కో డ్రోన్‌ అడ్డగింతకు తమకు చాలా తక్కువ ఖర్చు అయిందని.. కేవలం 2 డాలర్లు మాత్రమే వెచ్చించామని పేర్కొంది. ఇప్పటికే ఐరన్ బీమ్ వ్యవస్థ చాలా వరకు అందుబాటులోకి వచ్చిందని.. ఈ ఏడాది చివరికల్లా పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురానున్నట్లు ఐడీఎఫ్ వివరించింది.

Also Read : Glenn Maxwell : రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా ప్రముఖ క్రికెటర్ ‘మ్యాక్స్ వెల్’

Leave A Reply

Your Email Id will not be published!