ISRO Launches GSLV-F14: విజయవంతమైన ‘జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌14’ ప్రయోగం !

విజయవంతమైన ‘జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌14’ ప్రయోగం !

ISRO Launches GSLV-F14: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో రాకెట్‌ ను విజయవంతంగా ప్రయోగించింది. శ్రీహరికోట సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ నుంచి శనివారం సాయంత్రం 5.35 గంటలకు జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌14 వాహక నౌక… ఇన్సాట్‌-3 డీఎస్‌ ఉపగ్రహాన్ని నింగిలోకి మోసుకెళ్లింది. 18.46 నిమిషాల అనంతరం 2,275 కిలోల బరువు ఈ ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఇన్సాట్‌-3 డీఎస్‌ ను వాతావరణ పరిశీలనలను మెరుగుపరచడానికి, భూమి, సముద్ర ఉపరితలాలను పర్యవేక్షించడానికి రూపొందించారు.

ISRO Launches GSLV-F14 Viral

తద్వారా వాతావరణ అంచనా, విపత్తు హెచ్చరిక వ్యవస్థలను ఇది మెరుగుపరుస్తుంది. పదేళ్ల పాటు ఈ ఉపగ్రహం సేవలందించనుంది. గతంలో ప్రయోగించిన ఇన్‌శాట్‌–3 డీ, ఇన్‌శాట్‌–3 డీఆర్‌ ఉపగ్రహాలకు కొనసాగింపుగానే ఇన్‌శాట్‌–3 డీఎస్‌ని పంపుతున్నట్లు ఇస్రో వెల్లడించింది. ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలు, సిబ్బందికి ఛైర్మన్‌ సోమనాథ్‌ అభినందనలు తెలిపారు.

Also Read : Siricilla Rajaiah: రాష్ట్ర ఫైనాన్స్‌ కమిషన్‌ ఛైర్మన్‌ గా మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య !

Leave A Reply

Your Email Id will not be published!