ISRO: ‘భారతీయ అంతరిక్ష్ స్టేషన్’ నమునా విడుదల చేసిన ఇస్రో
‘భారతీయ అంతరిక్ష్ స్టేషన్’ నమునా విడుదల చేసిన ఇస్రో
ISRO : అంతరిక్ష రంగంలో భారత్ దూకుడు పెంచుతోంది. 2035 నాటికి సొంతగా అంతరిక్ష కేంద్రం ఏర్పాటు చేయాలని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) కృతనిశ్చయంతో ఉంది. ఈ క్రమంలో ‘భారతీయ అంతరిక్ష్ స్టేషన్ (BAS)’ నమూనాను తాజాగా విడుదల చేసింది. దిల్లీలో భారత మండపంలో శుక్రవారం నుంచి రెండు రోజులపాటు జరిగే నేషనల్ స్పేస్ డే వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ వేడకల సందర్భంగా ‘బాస్’ను పరిచయం చేసింది.
ISRO Release
ప్రస్తుతం అంతరిక్షంలో రెండు స్పేస్ స్టేషన్లు ఉన్నాయి. ఒకటి ఐదు దేశాల స్పేస్ ఏజెన్సీలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్(ISS) కాగా.. మరొకటి చైనా సొంతంగా నిర్మించుకున్న తియాంగాంగ్ స్పేస్ స్టేషన్. ఇప్పుడు భారత్ సొంతగా ఐదు మాడ్యుల్స్‌తో భారతీయ అంతరిక్ష్ స్టేషన్‌ను నిర్మించనుంది. తొలి మాడ్యుల్‌ను 2028 నాటికి నింగిలోకి పంపించడానికి ఇస్రో ప్రణాళికలు సిద్ధం చేసింది.
బాస్-1 మాడ్యుల్ దాదాపు 10 టన్నులు ఉండొచ్చని అంచనా. దీన్ని భూమికి 450 కి.మీ ఎత్తులో ప్రవేశపెట్టనున్నారు. ఇందులో దేశీయంగా అభివృద్ధి చేసిన ఇన్విరాన్‌మెంటల్ కంట్రోల్ అండ్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్(ఈసీఎల్ఎస్ఎస్), భారత్ డాకింగ్ సిస్టమ్, భారత్ బెర్తింగ్ మెకానిజమ్, ఆటోమెటెడ్ హ్యాచ్ సిస్టమ్తోపాటు మరిన్ని సౌకర్యాలను కలిగి ఉంటుంది. అంతరిక్షం, ఔషధాలు, గ్రహాంతర అన్వేషణకు ఈ మాడ్యుల్ వేదిక కానుంది.
Also Read : Supreme Court: బిహార్ లో రాజకీయ పార్టీల తీరుపై సుప్రీం ఆగ్రహం
