ISRO: గగన్‌యాన్‌ మిషన్‌ లో భాగంగా ఎయిర్‌ డ్రాప్‌ టెస్ట్‌ విజయవంతం

గగన్‌యాన్‌ మిషన్‌ లో భాగంగా ఎయిర్‌ డ్రాప్‌ టెస్ట్‌ విజయవంతం

ISRO : భారత్‌ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గగన్‌యాన్‌ అంతరిక్ష ప్రాజెక్టులో ఇస్రో  (ISRO) మరో ముందడుగు వేసింది. క్రూ మాడ్యూల్‌కు సంబంధించిన తొలి ఇంటిగ్రేటెడ్‌ ఎయిర్‌ డ్రాప్‌ టెస్టు (IADT-01)ను విజయవంతంగా నిర్వహించింది. వాయుసేన, నౌకాదళం, డీఆర్డీవో, కోస్ట్‌గార్డ్‌ల సంయుక్త సహకారంతో సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్)లో ఈ పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. గగన్‌యాన్ మిషన్ల కోసం ఈ పరీక్షను నిర్వహించారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్, DRDO, ఇండియన్ నేవీ, ఇండియన్ కోస్ట్ గార్డ్ ల సంయుక్త సహకారంతో ఈ పరీక్ష విజయవంతంగా ముగించారు. గగన్‌యాన్ మిషన్ల కోసం పారాచూట్ ఆధారిత డిసిలరేషన్ సిస్టమ్ ఎండ్ టు ఎండ్ ప్రదర్శన చేశారు. ఇస్రో (ISRO) మొదటి ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్ట్ ఇది. ఇందులో భాగంగా భవిష్యత్తులో ప్రయోగించబోయే మానవ సహిత ప్రయోగాలకు ఉపయోగించే ‘క్రూ మోడ్యూల్’ టెస్ట్ చేశారు.

ISRO Test

ఈ ప్రయోగంలో భాగంగా మాడ్యూల్‌ నమూనాను హెలికాప్టర్‌ సాయంతో నింగిలోకి తీసుకెళ్లి… కిందికి జారవిడిచారు. పారాచూట్ల సాయంతో ఆ మాడ్యూల్‌ వేగాన్ని తగ్గించుకుంటూ. సముద్ర జలాల్లో సురక్షితంగా దిగింది. మానవసహిత అంతరిక్ష ప్రయోగాల సమయంలో వ్యోమగాములు భూమికి సురక్షితంగా తిరిగి వచ్చేందుకు దీన్ని ఉపయోగిస్తారు. మాడ్యూల్‌ భూవాతావరణంలోకి ప్రవేశించిన అనంతరం దాని వేగ నియంత్రణ, ల్యాండింగ్‌ విషయంలో పారాచూట్ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుంది. సంక్లిష్టమైన ఈ వ్యవస్థ పనితీరును పరీక్షించడమే లక్ష్యంగా ఈ ప్రయోగం చేపట్టినట్లు సమాచారం. దీనిలో భాగంగా శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుండి 35 కిలోమీటర్ల దూరంలో భూమి ఉపరితలం నుంచి 3 కిలోమీటర్ల ఎత్తున డ్రాప్ టెస్ట్ చేశారు. ప్రధానంగా ఈ పరీక్షలో వివిధ ఎలక్ట్రానిక్ పరికరాలు, పేరాచూట్ సమర్ధత, పనితీరు, వ్యోమగాములను సురక్షితంగా తీసుకురావడానికి కావలసిన పరిస్థితులను పరీక్షించారు. అనంతరం సముద్రంలో పడిన క్రూ మోడ్యూల్’ను నేవి దళల వారు సేకరించి చెన్నై పోర్టుకు తరలించారు.

భారత వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపే లక్ష్యంతో చేపట్టిన గగన్‌యాన్‌ మిషన్‌లో భాగంగా ఇస్రో అనేక పరీక్షలు నిర్వహిస్తోంది. జులైలో సర్వీస్‌ మాడ్యూల్‌ ప్రొపల్షన్‌ సిస్టమ్‌ కు సంబంధించి రెండు హాట్‌ టెస్టులను విజయవంతంగా చేపట్టింది. 2027లో తొలి మానవసహిత అంతరిక్ష యాత్ర నిర్వహించనున్నట్లు కేంద్రమంత్రి జితేంద్ర సింగ్‌ ఇటీవల వెల్లడించారు.

Also Read : Urea Shortage: యూరియా కొరతపై బీజేపీ, బీఆర్‌ఎస్‌లు డ్రామాలు ఆడుతున్నాయి – సీఎం రేవంత్‌

Leave A Reply

Your Email Id will not be published!