IT Minister Sridharbabu : కొత్త పారిశ్రామిక వేత్తలకు కూడా అన్ని విధాలా సహకరిస్తాం
దేశంలో ఎక్కడా లేని కొత్త బయోమెడికల్ సిస్టమ్స్ అందుబాటులోకి రానున్నాయన్నారు
IT Minister Sridharbabu : ప్రతిష్టాత్మక 21వ బయో ఆసియా సదస్సు (Biao Asia 2024)కు హైదరాబాద్ వేదికగా నిలిచిందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. హెచ్‌ఐసిపిలో జరిగిన బయోఏషియా 2024 సదస్సు మొదటి కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం కింద తెలంగాణలోకి 40 వేల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయన్నారు. కొత్త ప్రభుత్వంపై పెట్టుబడిదారులకు విశ్వాసం ఉందనడానికి ఇదే నిదర్శనం అన్నారు. పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పారు.
IT Minister Sridharbabu Comment
దేశంలో ఎక్కడా లేని కొత్త బయోమెడికల్ సిస్టమ్స్ అందుబాటులోకి రానున్నాయన్నారు. పరిశ్రమల స్థాపన మాత్రమే కాకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఉద్యోగావకాశాలు కల్పించేలా విధానాలు రూపొందిస్తామన్నారు. వృత్తిదారులకు శిక్షణ ఇచ్చే కేంద్రంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రణాళిక రూపొందించారన్నారు. మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు ఆయా రంగాల్లో రాణించేలా తగిన విద్యను అందించాలనే విధానాన్ని ప్రభుత్వం అనుసరిస్తుందన్నారు.
Also Read : AP Speaker : 8 మంది పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఏపీ స్పీకర్ వేటు