IT Raids BBC : బీబీసీ ఆఫీసుల్లో ఐటీ సోదాలు
మోదీ బీబీసీ డాక్యుమెంటరీ వివాదం
IT Raids BBC : ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ బ్రిటీష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ (బీబీసీ)కి సంబంధించి భారత దేశంలోని ఆఫీసులపై ఏకకాలంలో ఆదాయ పన్ను శాఖ (ఐటీ) మెరుపు దాడులు(IT Raids BBC) చేపట్టింది.
ఇదిలా ఉండగా ఇటీవలే బీబీసీ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా రెండు ఎపిసోడ్స్ తో కూడిన డాక్యుమెంటరీని ప్రసారం చేసింది. ఇది ప్రపంచ వ్యాప్తంగా ప్రసారమైంది. పెద్ద ఎత్తున భారత్ లో తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. మోదీ ది క్వశ్చన్ పేరుతో దీనిని రూపొందించింది బీబీసీ. ఆయన సీఎంగా గుజరాత్ లో ఉన్న సమయంలో చోటు చేసుకున్న 2002 అల్లర్లకు సంబంధించి నిలదీసింది.
ఒక రకంగా ప్రధానమంత్రిని కడిగి పారేసింది. దీనిపై సీరియస్ గా స్పందించింది కేంద్ర సర్కార్. ఆ మేరకు బీబీసీకి సంబంధించిన డాక్యుమెంటరీని నిలిపి వేయాలంటూ ఆదేశించింది. అంతే కాదు దానికి సంబంధించి ఎలాంటి లింకులు ఉండ కూడదంటూ అన్ని సోషల్ మీడియా సంస్థలకు వార్నింగ్ ఇచ్చింది.
దీనిపై సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. బీబీసీని ఎలా నిషేధం విధిస్తామంటూ కోర్టు ప్రశ్నించింది. భావ ప్రకటనా స్వేచ్ఛ అన్నది ముఖ్యమని పేర్కొంది. అంతే కాదు ఒక డాక్యుమెంటరీ లేదా మోదీ ఎపిసోడ్ దేశాన్ని ప్రభావితం చేసే స్థితిలో ఉందా అయితే కేంద్రం ఎందుకు అభ్యంతరం చెప్పాల్సి వచ్చిందంటూ ప్రశ్నించింది.
ఈ తరుణంలో ఆదాయ పన్ను శాఖ దాడులు(IT Raids BBC) చేయడం కలకలం రేపింది. ప్రస్తుతం బీబీసీ ఢిల్లీ, ముంబై ఆఫీసుల్లో ఏక కాలంలో సోదాలు చేపట్టినట్లు సమాచారం. అయితే కావాలని దాడులకు దిగలేదని కేవలం లెక్కల్లో చోటు చేసుకున్న అవకతవకలపై మాత్రమే చూస్తున్నామని ఐటీ తెలిపింది.
Also Read : మన్నించండి సువేందును క్షమించండి