Jagadguru Rambhadracharya: జ్ఞానపీఠ్‌ పురస్కారం స్వీకరించిన గుల్జార్, రామభద్రాచార్య

జ్ఞానపీఠ్‌ పురస్కారం స్వీకరించిన గుల్జార్, రామభద్రాచార్య

Jagadguru Rambhadracharya : 2023 సంవత్సరానికి గాను ప్రముఖ కవి, సినీ గేయరచయిత గుల్జార్‌, సంస్కృత పండితుడు జగద్గురు రామభద్రాచార్యలను జ్ఞానపీఠ్‌ అవార్డులకు ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ జ్ఞానపీఠ్‌ పురస్కారాన్ని ప్రముఖ కవి, సినీ గేయరచయిత గుల్జార్‌కు, సంస్కృత పండితుడు జగద్గురు రామభద్రాచార్యకు(Jagadguru Rambhadracharya) అందజేశారు. అయితే అనారోగ్య కారణాలతో ఈ కార్యక్రమానికి గుల్జార్‌ హాజరుకాలేకపోయారు. ప్రముఖ హిందూ ఆధ్యాత్మిక గురువు, సంస్కృత పండితుడు, చిత్రకూట్‌ లోని తులసీ పీఠ్‌ వ్యవస్థాపకుడు 75 ఏళ్ల జగద్గురు రామభద్రాచార్య మాత్రం ఈ కార్యక్రమానికి హాజరై… రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఆయన రాష్ట్రపతి చేతుల మీదుగా నగదు పురస్కారం, సరస్వతి కాంస్య విగ్రహం అందుకున్నారు. సాహిత్యానికి, సమాజానికి రామభద్రాచార్య చేసిన సేవలను ముర్ము కొనియాడారు. 90 ఏళ్ల గుల్జార్‌ను కూడా అభినందించారు. అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Jagadguru Rambhadracharya – ప్రముఖ కవి, సినీ గేయరచయిత గుల్జార్

ప్రసిద్ధ బాలీవుడ్‌ సినీ రచయిత, ఉర్దూ కవి సంపూరణ్‌ సింగ్‌ కాల్రా అలియాస్‌ గుల్జార్‌(89)ను ఇప్పటికే ఎన్నో పురస్కారాలు వరించాయి. 2002లో సాహిత్య అకాడమీ అవార్డు స్వీకరించారు. 2013లో దాదాసాహెబ్‌ ఫాల్కే, 2004లో పద్మభూషణ్‌ పురస్కారం అందుకున్నారు. ఐదు సార్లు జాతీయ ఫిలిం అవార్డు పొందారు. స్లమ్‌డాగ్‌ మిలియనీర్, మాచీస్, ఓంకారా, దిల్‌ సే, గురు వంటి చిత్రాల్లో ఆయన రాసిన పాటలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌లోని ‘జై హో’ పాటకు 2009లో ఆస్కార్‌ అవార్డు దక్కింది. తాజాగా 2023వ సంవత్సరానికి జ్ఞానపీఠ్‌ పురస్కారానికి ప్రముఖ కవి, సినీ గేయరచయిత గుల్జార్‌ ను ఎంపిక చేసారు.

బహుముఖ ప్రజ్ఞాశాలి రామభద్రాచార్య

ప్రముఖ హిందూ ఆధ్యాత్మిక గురువు, సంస్కృత పండితుడు, చిత్రకూట్‌ లోని తులసీ పీఠ్‌ వ్యవస్థాపకుడు జగద్గురు రామభద్రాచార్యను(Jagadguru Rambhadracharya) కూడా 2023వ సంవత్సరానికి జ్ఞానపీఠ్‌ పురస్కారానికి ఎంపిక చేసారు. ఉత్తరప్రదేశ్‌లో జన్మించిన జగద్గురు రామభద్రాచార్య(74) మధ్యప్రదేశ్‌లోని చిత్రకూట్‌లో తులసీ పీఠాన్ని స్థాపించారు. రామానంద పరంపరలో ప్రస్తుతం ఉన్న నలుగురు జగద్గురువుల్లో ఆయన కూడా ఒకరు. రెండు నెలల వయసులో ఇన్ఫెక్షన్‌ వల్ల కంటి చూపు కోల్పోయారు. ఐదేళ్ల వయసులోనే భగవద్గీతను, ఎనిమిదేళ్ల వయసులో రామచరితమానస్‌ ను కంఠస్తం చేశారు. రామభద్రాచార్య బహు ముఖ ప్రజ్ఞాశాలిగా పేరుగాంచారు. 22 భాషల్లో మాట్లాడగలరు. సంస్కృతం, హిందీ, అవదీ, మైథిలీ తదితర భాషల్లో రచనలు చేశారు. 240కిపైగా పుస్తకాలు రాశారు. 2015లో కేంద్ర ప్రభుత్వం ఆయనను పద్మవిభూషణ్‌ పురస్కారంతో సత్కరించింది.

Also Read : Pakistan PM: భారత్ దాడులను ఎట్టకేలకు ఒప్పుకున్న పాక్ ప్రధాని

Leave A Reply

Your Email Id will not be published!