Jagadish Reddy: జగదీశ్‌ రెడ్డిని అసెంబ్లీలోనికి వెళ్ళనీయకుండా అడ్డుకున్న మార్షల్స్

జగదీశ్‌ రెడ్డిని అసెంబ్లీలోనికి వెళ్ళనీయకుండా అడ్డుకున్న మార్షల్స్

Jagadish Reddy : తెలంగాణా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయిన రోజున గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీశ్‌ రెడ్డి(Jagadish Reddy) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీనితో జగదీశ్ రెడ్డిని ఈ నెల 27 వరకు శాసనసభ సమావేశాల నుండి సస్పెన్షన్ చేస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌ ప్రకటించారు. అయినప్పటికీ జగదీశ్‌ రెడ్డి సోమవారం అసెంబ్లీకి వచ్చారు. దీనితో సభ లోపలికి వెళ్లకుండా జగదీశ్‌ రెడ్డిని చీఫ్‌ మార్షల్ అడ్డుకున్నారు. దీనితో శాసనసభ సమావేశాలను ఇష్టారీతిన నిర్వహిస్తున్నారని ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి ఆరోపించారు.

Jagadish Reddy Comment

ఈ సందర్భంగా ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… తనను అసెంబ్లీకి రావొద్దనడానికి ఎలాంటి ఆంక్షలు ఉన్నాయని ప్రశ్నించారు. ‘‘నన్ను ఏ కారణంతో సస్పెండ్‌ చేశారు. దీనిపై ఇప్పటివరకు ఎలాంటి బులెటిన్‌ విడుదల చేయలేదు. సస్పెండ్‌ చేశారో, లేదో కనీసం ఆధారాలు లేవు. బులెటిన్‌ ఇస్తే నేను రాను. లేదంటే సభాపతిని కలుస్తా. నేను కోర్టుకు వెళ్తానన్న భయంతో బులెటిన్‌ ఇవ్వట్లేదు. ఎలాంటి రాజ్యాంగ విలువలు, నిబంధనలు పాటించకుండా సమావేశాలను నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ అరాచకత్వానికి ఇది పరాకాష్ట. మంత్రులు జవాబివ్వలేక … ప్రశ్నోత్తరాలు రద్దు చేస్తున్నారు. దావత్‌లకు కూడా మంత్రులు ప్రభుత్వ హెలికాప్టర్లలో వెళ్తున్నారు’’ అని జగదీశ్‌ రెడ్డి దుయ్యబట్టారు.

Also Read : Bill Gates: విశాఖ వాసిని ప్రశంసలతో ముంచెత్తిన బిల్‌ గేట్స్‌

Leave A Reply

Your Email Id will not be published!