Jagdeep Dhankar : కొలీజియంపై ‘జగదీప్’ షాకింగ్ కామెంట్స్
పార్లమెంట్ చట్టాన్ని ఎలా రద్దు చేస్తారు
Jagdeep Dhankar : భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ ఖర్ సంచలన కామెంట్స్ చేశారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా ఉన్న సమయంలో ఫక్తు భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా వ్యవహరించారని సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. ఆపై ఈ గవర్నర్ తమకు వద్దంటూ ఏకంగా అసెంబ్లీలో తీర్మానం చేశారు.
అత్యంత వివాదాస్పదమైన వ్యక్తిని తీసుకు వచ్చి ఏకంగా ఉప రాష్ట్రపతి పదవిని కట్టబెట్టారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. కాగా ప్రస్తుతం కొలీజియం వ్యవస్థపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజిజు బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇలాంటి వ్యవస్థ ప్రపంచంలో ఎక్కడా లేదని ఒక్క భారత్ లో తప్ప అని మండిపడ్డారు. కోర్టు తీర్పుల కంటే రాజకీయాలు న్యాయమూర్తులకు ఎక్కువై పోయాయని ఎద్దేవా కూడా చేశారు. ఈ తరుణంలో న్యాయ వ్యవస్థ తీవ్ర అభ్యంతరం తెలిపింది.
ఇదిలా ఉండగా నిబద్దత కలిగిన ప్రధాన న్యాయమూర్తిగా పేరొందిన ధనంజయ వై చంద్రచూడ్ సీజేఐగా కొలువు తీరాక కేంద్రం వర్సెస్ సుప్రీంకోర్టుగా మారి పోయింది. ప్రధానంగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నియమాకంపై సంచలన వ్యాఖ్యలు చేసింది ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం.
ఇదే క్రమంలో సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులను నియమించే కొలీజియం వ్యవస్థను రద్దు చేసేందుకు ప్రయత్నించిన ఎన్జేఏసీ చట్టాన్ని రాజ్యాంగ విరుద్దమంటూ సుప్రీంకోర్టు కొట్టి వేసింది. దీనిని తీవ్రంగా తప్పు పట్టారు ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ కర్(Jagdeep Dhankar). ఇదే సమావేశంలో సీజేఐ చంద్రచూడ్ కూడా ఉన్నారు.
Also Read : తమిళనాడు గుడుల్లో మొబైల్స్ బ్యాన్