Jagdeep Dhankar : ఉప రాష్ట్రపతిగా కొలువు తీరిన ధన్ ఖర్
ప్రమాణ స్వీకారం చేసిన జగదీప్
Jagdeep Dhankar : భారత దేశ ఉప రాష్ట్రపతిగా జగదీప్ ధన్ ఖర్ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు.
ఆగస్టు 6న మార్గరెట్ అల్వాను జగదీప్ ధన్ ఖర్ ఓడించారు. 1997 తర్వాత జరిగిన గత ఆరు ఉపాధ్యక్ష ఎన్నికల్లో ఆయనే అత్యధిక విజయాలలో ఆధిక్యం సాధించారు.
ఆయన 14వ ఉప రాష్ట్రపతిగా కొలువు తీరారు. జగదీప్ స్వస్థలం రాజస్థాన్. ప్రముఖ రాజకీయ నాయకుడు. పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా పని చేశారు.
ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో జగదీప్ ధన్ ఖర్ 74.36 శాతం ఓట్లు సాధించారు. భారీ తేడాతో విక్టరీ సాధించారు. ఇదిలా ఉండగా ఇటీవలే రాష్ట్రపతిగా ఒడిశాకు చెందిన ద్రౌపది ముర్ము ఎన్నికయ్యారు.
ఆమె ఆదివాసీ కుటుంబం నుంచి పైకి వచ్చారు. ఆమె కూడా జార్ఖండ్ రాష్ట్రానికి గవర్నర్ గా పని చేశారు. ఇక రైతు కుటుంబం నుంచి వచ్చారు జగదీప్ ధన్ ఖర్.
విచిత్రం ఏమిటంటే ఇద్దరూ గవర్నర్లుగా పని చేస్తూ ఉప రాష్ట్రపతి, రాష్ట్రపతి ఉన్నత పదవుల్లో కొలువు తీరడం విశేషం. ఆగస్టు 10తో ఉప రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన వెంకయ్య నాయుడు పదవీ కాలం ముగిసింది.
ఆయన స్థానంలో జగదీప్ ధన్ ఖర్(Jagdeep Dhankar) ప్రమాణం చేయడం భారత దేశ చరిత్రలో కీలక పరిణామం అని చెప్పక తప్పదు. ధన్ ఖర్ కు బిజూ జనతాదళ్ , ఏపీ నుండి సీఎం జగన్మోహన్ రెడ్డి, బీఎస్పీ కూడా మద్దతు తెలిపారు.
Also Read : అట్టడుగు నుంచి అత్యున్నత స్థానం దాకా