Jagdeep Dhankhar : అట్ట‌డుగు నుంచి అత్యున్న‌త స్థానం దాకా

ఉప రాష్ట్ర‌ప‌తి జ‌గ‌దీప్ ఠ‌క్క‌ర్ ప్ర‌స్థానం

Jagdeep Dhankhar : అదృష్టం ఎప్పుడు ఎలా త‌లుపు త‌డుతుందో ఎవ‌రూ చెప్ప‌లేరు. ఓ మారుమూల ప‌ల్లెలో రైతు కుటుంబం నుంచి వ‌చ్చిన అత‌ను ఇవాళ భార‌త దేశానికి అత్యున్న‌త ఉప రాష్ట్ర‌ప‌తి అవుతాన‌ని. అత‌డు ఎవ‌రో కాదు జ‌గ‌దీప్ ధ‌న్ ఖ‌ర్(Jagdeep Dhankhar).

ఆయ‌న రాష్ట్రం రాజ‌స్థాన్. ఇవాళ దేశంలో గుజ‌రాతీలు, రాజ‌స్థాన్ కు చెందిన వారి హ‌వా కొన‌సాగుతోంది. అది వ్యాపారం అయినా లేదా రాజ‌కీయం అయినా వాళ్లే టాప్ పొజిష‌న్ల‌లో కొన‌సాగుతూ వ‌స్తున్నారు.

ఎప్పుడైతే ప్ర‌ధాన మంత్రిగా న‌రేంద్ర మోదీ(PM Modi) దేశంలో కొలువు తీరారో ఆనాటి నుంచి వీళ్ల‌కు లైన్ క్లియ‌ర్ అయ్యింది. ఇక జ‌గ‌దీప్ ధ‌న్ ఖ‌ర్ కు ల‌క్ క‌లిసి వ‌చ్చింది.

ఆయ‌న ప‌శ్చిమ బెంగాల్ రాష్ట్రంలో గ‌వ‌ర్న‌ర్ గా తీవ్ర వివాదాస్పంగా మారారు. చివ‌ర‌కు ఆయ‌న‌ను త‌మ‌కు వ‌ద్దంటూ ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం ఏకంగా అసెంబ్లీలో తీర్మానం చేసింది.

భార‌తీయ జ‌న‌తా పార్టీకి మౌత్ పీస్ గా ప‌ని చేశార‌న్న ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్నారు. మ‌మ‌తా బెన‌ర్జీతో నువ్వా నేనా అన్న తీరులో ధ‌న్ ఖ‌ర్

ప్ర‌వ‌ర్తించిన తీరు చివ‌ర‌కు ఉప రాష్ట్ర‌ప‌తి బ‌రిలో నిలిచేలా చేసింద‌న‌డంలో సందేహం లేదు.

రాజ‌కీయంగా సీనియ‌ర్ నాయ‌కుడు. అపార‌మైన అనుభ‌వం ఉంది. సీనియ‌ర్ న్యాయ‌వాది కూడా. ప్ర‌స్తుతం ధ‌న్ ఖ‌ర్ కు 71 ఏళ్లు. చిన్న‌ప్ప‌టి నుంచి స్వ‌శ‌క్తితో పైకి వ‌చ్చారు.

క‌ష్టం ఏమిటో త‌న‌కు తెలుసు. 1951 మే 18న రాజ‌స్థాన్ లోని ఝుంఝును జిల్లా కితానా అనే ఓ గ్రామంలో పుట్టారు. కుటుంబం రైతు నేప‌థ్యం. న్యాయ‌నిపుణుడిగా పేరు తెచ్చుకున్నారు.

విచిత్రం ఏమిటంటే ఆయ‌న‌కు చిన్న పిల్ల‌లంటే అపార‌మైన ఇష్టం కూడా. గ‌వ‌ర్న‌ర్ గా ఉన్న స‌మ‌యంలో కూడా ఆయ‌న ప్రోటో కాల్ ను కాద‌ని విద్యా సంస్థ‌ల వ‌ద్ద‌కు వెళ్ల‌డం, వాళ్ల‌కు పాఠాలు చెప్ప‌డం చేస్తూ వ‌చ్చారు.

జ‌న‌తా ద‌ళ్ నుంచి ఎంపీగా గెలుపొందారు. 1989-91లో మంత్రిగా ప‌ని చేశారు. 1993-98 మధ్య ఎమ్మెల్యేగా ఉన్నారు. రాజస్థాన్ హైకోర్టు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉన్నారు.

ఇంట‌ర్నేష‌న‌ల్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేష‌న్ లో మెంబ‌ర్ గా , సుప్రీంకోర్టులో ప‌ని చేశారు. 2003లో భార‌తీయ జ‌న‌తా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. 2019లో గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వి ద‌క్కింది.

అంత‌లోనే ఉప రాష్ట్ర‌ప‌తి గా ఎంపిక కావ‌డం యాధృశ్చికం అనుకోవాలా లేక అనుభ‌వానికి ద‌క్కిన గౌర‌వం అనుకోవాలో కాల‌మే స‌మాధానం చెప్పాలి.

Also Read : బీజేపీకి మ‌ద్ద‌తు ఇవ్వ‌డంపై ‘అల్వా’ ఫైర్

Leave A Reply

Your Email Id will not be published!