Jagdeep Dhankhar: ఉప రాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖడ్‌కు వచ్చే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏమిటో తెలుసా ?

ఉప రాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖడ్‌కు వచ్చే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏమిటో తెలుసా ?

Jagdeep Dhankhar : ఉప రాష్ట్రపతి పదవిలో ఉండగానే ఆరోగ్య కారణాలతో పదవికి రాజీనామా చేసిన మూడో వ్యక్తిగా జగ్‌దీప్ ధన్‌ఖడ్‌ నిలిచారు. గతంలో వివీ గిరి, ఆర్ వెంకట్రామన్‌లు సర్వీసులో ఉండగానే పదవి నుంచి వైదొలిగారు. దీనితో పదవి మధ్యలోనే తప్పుకుంటే వచ్చే రిటైర్మెంట్ ప్రయోజనాలు ఏవిధంగా ఉంటాయనేదానిపై ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఉప రాష్ట్రపతిగా రెండేళ్ల పాటు సేవలందించిన వారు పెన్షన్‌ కు అర్హులవుతారు. ఆ ప్రకారం ధన్‌కఢ్‌కు రిటైర్‌మెంట్ ప్రయోజనాలు వర్తిస్తాయి.

Jagdeep Dhankhar Resign

నిబంధనల ప్రకారం నెలవారీ వేతనంలో 50 నుంచి 60 శాతం పెన్షన్‌ వస్తుంది. ఆ విధంగా ధన్‌ఖడ్‌కు రూ.60,000 వరకూ పెన్షన్ వస్తుంది. లూటెన్స్ ఢిల్లీలో టైప్ VIII బంగ్లా కేటాయించే అవకాశం ఉంది. అలాకాకుండా ఇండియాలో వేరెక్కడైనా కోరుకుంటే అద్దె, విద్యుత్, నీటి బిల్లులు వంటివి జీవితాంతం చెల్లించనవసరం లేకుండా సౌకర్యం కల్పిస్తారు. సెక్రటేరియట్ స్టాఫ్‌గా ప్రైవేటు సెక్రటరీ, అడిషనల్ ప్రైవేటు సెక్రటరీ, పెర్సనల్ అసిస్టెంట్, ఇద్దరు ప్యూన్లను ఇస్తారు.

ఇండియాలో ఎక్కడికైనా విమానం, రైలు, స్టీమర్‌లో ఉచితంగా ప్రయాణించే సౌకర్యం ధన్‌ఖడ్‌ (Jagdeep Dhankhar) కు ఉంటుంది. తోడుగా ఒకరిని తీసుకువెళ్లవచ్చు. ఫర్నిచర్, ఎలక్ట్రానిక్ వస్తువులు, రెండు మొబైల్ ఫోన్ల సౌకర్యం కల్పిస్తారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత వైద్యంతో పాటు వ్యక్తిగత డాక్టర్‌ కూడా అందుబాటులో ఉంటారు.

Jagdeep Dhankhar – త్వరలో అధికారిక నివాసం ఖాళీ చేయనున్న ధన్‌ఖడ్‌

ఉప రాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌ (Jagdeep Dhankhar) రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. ఈ క్రమంలో తన అధికారిక నివాసాన్ని త్వరలోనే ఖాళీ చేసే యోచనలో ధన్‌ఖడ్‌ ఉన్నట్లు తెలుస్తోంది. ఆయనకు సంబంధించిన వస్తువులను మంగళవారం నుంచే ప్యాక్‌ చేసుకోవడం మొదలుపెట్టినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

పార్లమెంటు హౌస్‌ కాంప్లెక్స్‌ సమీపంలోని చర్చి రోడ్డులో నూతనంగా నిర్మించిన వైస్‌ ప్రెసిడెంట్‌ ఎన్‌క్లేవ్‌కు జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌ గతేడాది ఏప్రిల్‌లో మారారు. ఉప రాష్ట్రపతి అధికార నివాసం, కార్యాలయంగా ఉండే ఆ వీపీ ఎన్‌క్లేవ్‌ను సెంట్రల్‌ విస్టా డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టులో భాగంగా నిర్మించారు. గత 15 నెలలుగా జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌ అక్కడ నివాసముంటున్నారు. అయితే, ధన్‌ఖడ్‌కు లుటియన్స్‌ దిల్లీలో టైప్‌ VIII లేదా మరో ప్రాంతంలో బంగ్లా ఇచ్చే అవకాశం ఉందని పురపాలక శాఖ అధికారులు వెల్లడించారు. సాధారణంగా టైప్‌ VIII బంగ్లాను కేంద్ర మంత్రులు, జాతీయ పార్టీల అధ్యక్షులకు కేటాయిస్తారు.

ఇదిలాఉంటే, ఉప రాష్ట్రపతి పదవికి జగదీప్‌ ధన్‌ఖడ్‌ చేసిన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మంగళవారమే ఆమోదించారు. అనంతరం కేంద్ర హోంశాఖ కూడా గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. అటు ఎన్నికల సంఘం కూడా నూతన ఉప రాష్ట్రపతి ఎన్నిక కోసం ఏర్పాట్లు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఎలక్టోరల్‌ కాలేజీ జాబితాను రూపొందించడం, రిటర్నింగ్‌ ఆఫీసర్ల పేర్లు ఖరారు చేయడం వంటి పనుల్లో నిమగ్నమైనట్లు సమాచారం.

Also Read : Murder: భార్యను కాపురానికి పంపలేదని అత్తను చంపిన అల్లుడు

Leave A Reply

Your Email Id will not be published!