Jagga Reddy: ఢిల్లీకి హుటాహుటిన బయలుదేరిన జగ్గారెడ్డి !

ఢిల్లీకి హుటాహుటిన బయలుదేరిన జగ్గారెడ్డి !

Jagga Reddy: తెలంగాణా పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి హుటాహుటిన దిల్లీ బయలుదేరి వెళ్లారు. మంగళవారం జూబ్లీహిల్స్ లోని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఇంటికి వెళ్ళిన జగ్గారెడ్డి… పలు అంశాలపై దాదాపు 20 నిమిషాల పాటు చర్చించారు. అయితే భేటీలో  చర్చించిన విషయాలను మీడియాకు వెల్లడించడానికి జగ్గారెడ్డి నిరాకరించి అక్కడ నుండి వెళ్ళిపోయారు. అయితే అకస్మాత్తుగా జగ్గారెడ్డి హుటాహుటీన బుధవారం ఢిల్లీ వెళ్లడం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

Jagga Reddy Viral

అధిష్టానం నుండి పిలుపురావడంతో జగ్గారెడ్డి ఢిల్లీకు వెళ్ళినట్లు తెలుస్తోంది. ఢిల్లీ చేరుకున్న అనంతరం కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో జగ్గారెడ్డి(Jagga Reddy) సమావేశం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇటీవల ఎన్నికల్లో సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం నుండి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఓటమి చెందిన జగ్గారెడ్డి… పీసీసీ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు మరో మూడు నెలల్లో లోక్ సభ ఎన్నికలు రానున్న నేపథ్యంలో మెదక్ ఎంపీగా తన కుమార్తె జయారెడ్డి లేదా సతీమణి నిర్మలను పోటీలో నిలబెడతారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే లాబీయింగ్ కోసం ఢిల్లీ అధిష్టానం వద్దకు వెళ్ళినట్లు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

తెలంగాణా రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు పొందిన జగ్గారెడ్డి… ఇటీవల జరిగిన ఎన్నికల్లో సిట్టింగ్ స్థానం సంగారెడ్డి నుండి పోటీ చేసి ఓటమి చెందారు. జగ్గారెడ్డి(Jagga Reddy) గెలిస్తే… ఖచ్చితంగా మంత్రి పదవి వచ్చేది అనే టాక్ అతని అనుచరుల నుండి వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ రేసులో జగ్గారెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. టీపీసీసీ రేసులో జగ్గారెడ్డితో పాటు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, గడ్డం వివేకానంద, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఉన్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. మరో మూడు నెలల్లో లోక్ సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎంపీ సీట్ల కోసం లాబీయింగ్ లు ప్రారంభమైన నేపథ్యంలో ఢిల్లీ పర్యటన ముగిస్తే తప్ప జగ్గారెడ్డి హుటాహుటీ పయనం వెనుక కారణాలపై క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.

Also Read : Ambati Rayudu: పవన్ కళ్యాణ్ తో అంబటి రాయుడు భేటీ ! ఆశక్తికరంగా ఏపి రాజకీయాలు

Leave A Reply

Your Email Id will not be published!