S Jai Shankar : ఉప ప్ర‌ధానికి జై శంక‌ర్ క్రికెట్ బ్యాట్ గిఫ్ట్

విరాట్ కోహ్లీ సంత‌కం చేసిన బ్యాట్

S Jai Shankar : భార‌త‌దేశ విదేశాంగ శాఖ మంత్రి సుబ్ర‌మ‌ణ్యం జై శంక‌ర్ అరుదైన బ‌హుమ‌తిని ఆస్ట్రేలియా ఉప ప్ర‌ధాన మంత్రికి అంద‌జేశారు. ప్ర‌స్తుతం ఆయ‌న ఇచ్చిన గిఫ్ట్ నెట్టింట్లో వైర‌ల్ గా మారింది. ప్ర‌పంచ క్రికెట్ రంగంలో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌త క‌లిగిన స్టార్ ప్లేయ‌ర్ గా పేరొందిన విరాట్ కోహ్లీ స్వ‌త‌హాగా సంత‌కం చేసిన క్రికెట్ బ్యాట్ ను గిఫ్ట్ గా అంద‌జేశారు.

ఆస్ట్రేలియాలోని పాత పార్ల‌మెంట్ భ‌వనాన్ని భార‌త జాతీయ రంగులతో వెలిగించారు. విదేశాంగ శాఖ మంత్రి జై శంక‌ర్ కు అపూర్వ‌మైన రీతిలో స్వాగ‌తం ల‌భించింది. ఆస్ట్రేలియాలోని కాన్ బెర్రాలో ఆ దేశ ఉప ప్ర‌ధాన‌మంత్రి రిచ‌ర్డ్ మార్లెస్ తో స‌మావేశం అయ్యారు. రెండు దేశాల‌ను క‌లిపే క్రికెట్ కు సంబంధించిన కోహ్లీ సిగ్నేచ‌ర్ చేసిన బ్యాట్ ను బహూక‌రించారు.

క్రికెట్ తో పాటు మ‌న‌ల్ని బంధించే అనేక అంశాలు ఇరు దేశాల మ‌ధ్య ముడిప‌డి ఉన్నాయి. ఇవాళ క్రికెట్ లెజెండ్ గా భావించే విరాట్ కోహ్లీ సంత‌కం చేసిన బ్యాట్ ను జై శంక‌ర్(S Jai Shankar) నుంచి బ‌హుమ‌తిగా అందుకోవ‌డం త‌న‌ను ఎంతో ఆశ్చ‌ర్యానికి గురి చేసింద‌ని పేర్కొన్నారు ఆస్ట్రేలియా డిప్యూటీ పీఎం మార్లెస్.

ఈ విష‌యాన్ని ఆయ‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా పంచుకున్నారు. ఆయ‌న ఉప ప్ర‌ధానితో పాటు ర‌క్ష‌ణ శాఖ మంత్రిగా ఉన్నారు. మార్లెస్ తో జ‌రిగిన కీల‌క భేటీలో జై శంక‌ర్ ప్రాంతీయ‌, ప్ర‌పంచ భ‌ద్ర‌త‌పై అభిప్రాయాల‌ను పంచుకున్నారు.

ఇదిలా ఉండ‌గా న్యూజిలాండ్ తో ప‌ర్య‌ట‌న ముగించుకుని ఆస్ట్రేలియాకు చేరుకున్నారు జై శంక‌ర్. అక్క‌డ కీల‌క స‌మావేశంలో ప‌లువురితో భేటీ కావ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

Also Read : ఉక్రెయిన్ పై ర‌ష్యా మిస్సైళ్ల మోత

Leave A Reply

Your Email Id will not be published!