Jignesh Mevani : ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీకి జైలు శిక్ష
2016 కేసులో 6 నెలల జైలు శిక్ష
Jignesh Mevani : గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీకి బిగ్ షాక్ తగిలింది. ఆయనకు ఆరు నెలల జైలు శిక్ష పడింది. 2016 లో జిగ్నేష్ మేవానీ ఇతర దళిత హక్కుల సంఘాలతో కలిసి గుజరాత్ యూనివర్శిటీ చట్ట భవనం పేరు మార్పుపై నిరసనలు చేపట్టారు.
దీనిపై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా జరిగిన విచారణలో జిగ్నేష్ మేవానీకి అహ్మదాబాద్ కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. ప్రస్తుతం జిగ్నేష్ మేవానీ గుజరాత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు.
ఎమ్మెల్యే మేవానీతో పాటు మరో 18 మందికి అహ్మదాబాద్ మెట్రో పోలీస్ కోర్టు 6 నెలల జైలు శిక్ష ఖరారు చేసింది. ఇదిలా ఉండగా ఈ యూనివర్శిటీకి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు.
అయతే అప్పీలు దాఖలు చేసేందుకు వీలుగా అప్పిలేట్ సెషన్స్ కోర్టు శిక్షను అక్టోబర్ 17 వరకు నిలిపి వేసింది. నిందితులకు బెయిల్ మంజూరు చేసింది. మొత్తం 19 మందికి ఈ బెయిల్ మంజూరు చేస్తున్నట్లు తెలిపింది కోర్టు.
ఇదిలా ఉండగా జిగ్నేష్ మేవానీ (Jignesh Mevani) ప్రస్తుతం అస్సాం కోర్టు మంజూరు చేసిన బెయిల్ పై బయట ఉన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా చేసిన ట్వీట్లకు సంబంధించి ఆయనను అరెస్ట్ చేశారు.
గుజరాత్ లోని పాలన్ పూర్ పట్టణంలో ఉండగా అస్సాం పోలీస్ టీం అరెస్ట్ చేసింది. ఇదే ఏడాది మేలో గుజరాత్ కోర్టు అనుమతి లేకుండా ర్యాలీని చేపట్టినందుకు 2017 కేసులో మేవానీకి మూడు నెలల జైలు శిక్ష విధించింది.
Also Read : జాన్సన్ బేబీ పౌడర్ లైసెన్స్ రద్దు