Jairam Ramesh : మోదీ ప్లాన్..అదానీ ఎన్డీటీవీ కొనుగోలు
అదానీ టేకోవర్ పై కాంగ్రెస్ పార్టీ ఫైర్
Jairam Ramesh : గత కొంత కాలం నుంచీ దేశంలో జాతీయ మీడియాలో స్వతంత్ర వ్యవస్థను కలిగి ఉంది ఎన్డీటీవీ. దానికంటూ ఓ ప్రత్యేకత ఉంది.
కానీ ఉన్నట్టుండి మీడియా బారెన్ గా, ప్రధాన మంత్రికి అత్యంత విశ్వసనీయమైన సహచర వ్యాపారవేత్తగా పేరొందారు అదానీ గ్రూప్ సంస్థల చైర్మన్ గౌతమ్ అదానీ(Gautam Adani).
తాజాగా 5జీ స్పెక్ట్రమ్ వేలంలో కూడా పాల్గొన్నారు. మరో వైపు రిలయన్స్ సంస్థల చైర్మన్ ముకేష్ అంబానీ(Mukesh Ambani) తో పోటీ పడుతున్నారు అదానీ. ఈ తరుణంలో 2024లో దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి.
సోషల్ మీడియాలో టాప్ లో కొనసాగుతోంది బీజేపీ. రాబోయే కాలానికి ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది. ఈ తరుణంలో ఉన్నట్టుండి గౌతం అదానీ బాంబు పేల్చారు.
తాను ఎన్డీటీవీని టేకోవర్ చేసుకుంటున్నట్లు ప్రకటించారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా స్పందించారు. ఆ పార్టీకి చెందిన మీడియా ఇన్ చార్జ్ జై రామ్ రమేష్(Jairam Ramesh) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మోదీ సర్కార్ కు వ్యతిరేకంగా ఉంటూ వచ్చిన మీడియాను కూడా నియంత్రించే పనిలో పడ్డారంటూ ఆరోపించారు. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణే అదానీ ఎన్డీటీవీలో అతి పెద్ద వాటాను కొనుగోలుకు ఆసక్తి చూపడమని పేర్కొన్నారు.
ఇప్పటికే అదానీ విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, విద్యుత్ ఉత్పత్తి, ట్రాన్స్ మిషన్ , బొగ్గు, గ్యాస్ ట్రేడింగ్ తో సహా అనేక రంగాలలో అదానీ గ్రూప్ పబ్లిక్ లిస్టెడ్ కంపెనీలను కలిగి ఉందన్నారు.
కాగా జైరాం రమేష్ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.
Also Read : జేఎన్‌యూ వీసీ కామెంట్స్ కలకలం