Rahul Gandhi : మోదీ అబద్దం చైనా ఆక్రమణ నిజం
జై శంకర్ ను నిలదీసిన రాహుల్ గాంధీ
Rahul Gandhi China Threat : ఏఐసీసీ మాజీ చీఫ్ , వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. ఆయన ప్రధానంగా కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుబ్రమణ్యం జై శంకర్ ను టార్గెట్ చేశారు. అసలు చైనా నుంచి దేశానికి ముప్పు ఉందన్న సంగతి జై శంకర్ గుర్తించడం లేదన్నారు. ఒక రకంగా పిరికితనపు భావజాలానికి పరాకాష్ట అని ఎద్దేవా చేశారు రాహుల్ గాంధీ(Rahul Gandhi China Threat). ఓ వైపు దేశం యావత్తు ఆందోళనలో ఉంటే ప్రచార ఆర్బాటానికి మోదీ ప్రయారిటీ ఇస్తున్నారంటూ మండిపడ్డారు. చైనా బెదరింపులను ఎందుకు అర్థం చేసుకోలేక పోతున్నారంటూ ప్రశ్నించారు.
భారత భూభాగంలోకి ఎవరూ ప్రవేశించ లేదన్న ప్రధాని చేసిన ప్రకటన అత్యంత మోసపూరితమైనదని అన్నారు. దీనిని తాను ఖండిస్తున్నట్లు చెప్పారు రాహుల్ గాంధీ. లండన్ లో ఇండియన్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ తో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. కీలక వ్యాఖ్యలు చేశారు.
తాను భారత విదేశాంగ విధానానికి మద్దతు ఇస్తున్నానని రష్యా, ఉక్రెయిన్ యుద్దంపై భారత్ వైఖరికి సంబంధించి ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. ఇప్పటికే దేశంలోని కొంత భూభాగం ఆక్రమణకు గురైందని ఆవేదన వ్యక్తం చేశారు.
పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ చేతుల్లో 2,000 చదరపు కిలోమీటర్ల భూ భాగం పూర్తిగా చైనా పరమైందని ఆరోపించారు రాహుల్ గాంధీ(Rahul Gandhi). అయితే నరేంద్ర మోదీ ఒక్క అంగుళం కూడా తీసుకోలేదని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారని మండిపడ్డారు.
సరిహద్దులో చైనీయులు ఏం చేస్తున్నారనే దానిపై భారతదేశం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు కాంగ్రెస్ నేత. ఏది ఏమైనా మళ్లీ మళ్లీ చెబుతున్నా..చైనా నుంచి ప్రమాదం పొంచి ఉందని పేర్కొన్నారు.
Also Read : రికార్డు స్థాయిలో ఎగుమతులు – గోయల్