Jaiveer Shergill : కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ జైవీర్ షెర్గిల్ గుడ్ బై
ఏఐసీసీ తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీకి లేఖ
Jaiveer Shergill : 134 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ నుంచి మెల మెల్లగా దూరం అవుతున్నారు. సీనియర్లు సైతం తప్పుకుంటున్నారు. మరో వైపు కొద్ది రోజుల్లో పార్టీ చీఫ్ ను ఎన్నుకోనున్నారు.
ఈ తరుణంలో ఇప్పటికే దేశం పట్ల, వివిధ అంశాల పట్ల పట్టు కలిగిన మేధావులుగా గుర్తింపు పొందిన తెలంగాణకు చెందిన స్పోక్స్ పర్సన్ డాక్టర్ దాసోజు శ్రవణ్ తన పదవికి రాజీనామా చేశారు.
ఆయన బీజేపీలో చేరారు. మరో వైపు కాంగ్రెస్ పార్టీలో అత్యంత సీనియర్ నాయకుడిగా పేరొందిన , మాజీ కేంద్ర మంత్రి ఆనంద్ శర్మ తన కాంగ్రెస్ పార్టీ స్టీరింగ్ కమిటీ నుంచి తప్పుకున్నారు.
ఈ తరుణంలో బుధవారం మరో షాక్ తగిలింది పార్టీకి. ఒక రకంగా పెద్ద దెబ్బ అని చెప్పక తప్పదు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్న జైవీర్ షెర్గిల్(Jaiveer Shergill) రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
ప్రధానంగా పార్టీ నుంచి ఎందుకు వీడాల్సి వచ్చిందో కూడా సంచలన కామెంట్స్ చేశారు. పార్టీలో సైకా ఫాన్స్ కొందరు ఉన్నారంటూ ఆరోపించారు జైవీర్ షెర్గిల్.
ఈ మేరకు సోనియాకు లేఖ రాశారు. నిర్ణయాధికారం ఇకపై ప్రజల ప్రయోజనాల కోసం కాదని ఆ దిశగా పార్టీ నడుస్తోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. జైవీర్ షెర్గిల్ మీడియాతో మాట్లాడారు.
భారత జాతీయ కాంగ్రెస్ ప్రస్తుతం యువతను పట్టించు కోవడం లేదు. ప్రధానంగా పార్టీలో ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదన్నారు.
ఇదిలా ఉండగా గత కొన్ని నెలలుగా జైవీర్ షెర్గిల్ ను మీడియా సమావేశాలకు అనుమతించం లేదని సమాచారం. షెర్గిల్ పంజాబ్ కు చెందిన ప్రముఖ న్యాయవాదిగా ఉన్నారు.
Also Read : ఆరోగ్యానికి..ఆధ్యాత్మికతకు దేశం ఆలవాలం