Kuldeep Chahal : ఆపరేషన్ కొనసాగుతోంది – సీపీ
78 మందిని అరెస్ట్ చేశామన్న చాహల్
CP Kuldeep Chahal : దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ఖలిస్తానీ వేర్పాటు వాద వివాదాస్పద నాయకుడు అమృత పాల్ సింగ్ అరెస్ట్ వ్యవహారం కలకలం రేపుతోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలు నిలిపి వేశారు. మరో వైపు 50కి పైగా వాహనాలలో పోలీసులు అమృత పాల్ సింగ్ ను పట్టుకునేందుకు ప్రయత్నించారు. వీరిని తప్పించుకుని మోటార్ సైకిల్ పై పారి పోయాడని సమాచారం.
ఈ మొత్తం భారీ స్కెచ్ , ఆపరేషన్ కు సంబంధించి జలంధర్ పోలీస్ కమిషనర్ కుల్దీప్ చాహల్(CP Kuldeep Chahal) స్పందించారు. అమృత్ పాల్ సింగ్ సారథ్యం వహిస్తున్న వారిస్ పంజాబ్ దే సంస్థకి చెందిన 78 మంది సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశామని చెప్పారు. ఏడుగురు అమృత పాల్ సింగ్ ముష్కరులు కూడా ఉన్నారని వెల్లడించారు.
శనివారం సాయంత్రం మోటార్ సైకిల్ పై వెళుతుండగా పట్టుకునేందుకు ట్రై చేశామన్నారు కుల్దీప్ చాహల్. మరికొందరిని విచారణ చేపట్టేందుకు గాను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. అంతే కాకుండా ఖలిస్తానీ నేత ఆర్థిక వ్యవహారాలను నిర్వహిస్తున్న అమృత పాల్ సింగ్ సన్నిహితుడు దల్జీత్ సింగ్ కల్సిని కూడా హర్యానా లోని గుర్గావ్ లో అరెస్ట్ చేశామన్నారు.
ఏడు జిల్లాల సిబ్బందితో కూడిన రాష్ట్ర పోలీసు ప్రత్యేక బృందం జలంధర్ లోని షాకోట్ తహసీల్ కు వెళుతుండగా ఖలిస్తానీ నేత అమృత పాల్ సింగ్ కాన్వాయ్ ని అనుసరించింది.
పోలీసులు తమను వెంబడిస్తున్నారంటూ సింగ్ అనుచరులు సోషల్ మీడియాలో కొన్ని వీడియోలను పంచుకున్నారు. దీంతో తమ మద్దతుదారులు గుమి గూడాలని కోరారు. అనేక ప్రదేశాల్లో భద్రతను మరింత పెంచారు.
Also Read : పంజాబ్ లో బిగ్ ట్విస్ట్..హై అలర్ట్