Rahul Gandhi Demand : జ‌మ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర‌ హోదా ఇవ్వాలి

ఆ డిమాండ్ కు కాంగ్రెస్ సంపూర్ణ మ‌ద్ద‌తు

Rahul Gandhi Demand : కాంగ్రెస్ అగ్ర నాయ‌కుడు రాహుల్ గాంధీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. జ‌మ్మూ కాశ్మీర్ లో ఆయ‌న భార‌త్ జోడో యాత్ర కొన‌సాగుతోంది. సోమ‌వారం యాత్ర సంద‌ర్భంగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. జ‌మ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర హోదా కోసం కాంగ్రెస్ పార్టీ బేష‌ర‌తుగా మ‌ద్ద‌తు ఇస్తుంద‌ని ప్ర‌క‌టించారు.

త‌న యాత్ర సంద‌ర్భంగా వేలాది మంది రాహుల్ గాంధీని క‌లుసుకున్నారు. కాశ్మీరీ పండిట్లు సైతం త‌మ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. తాము ఆందోళ‌న చేస్తున్నా కేంద్రం ప‌ట్టించు కోవ‌డం లేదంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్భంగా తమ పార్టీ మీకు మ‌ద్ద‌తు ఇస్తుంద‌ని, అండ‌గా ఉంటుంద‌ని హామీ ఇచ్చారు రాహుల్ గాంధీ.

జ‌మ్మూ కాశ్మీర్ లో దేశంలోనే అత్య‌ధిక నిరుద్యోగం ఇక్క‌డ ఉంద‌న్నారు. న‌రేంద్ర మోదీ ప్ర‌తి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు భ‌ర్తీ చేస్తానంటూ ప్ర‌గ‌ల్భాలు ప‌లికారు. కానీ 10 వేల జాబ్స్ కూడా క‌ల్పించ లేక పోయారంటూ ఎద్దేవా చేశారు రాహుల్ గాంధీ(Rahul Gandhi Demand). ఇక రాష్ట్ర హోదా డిమాండ్ అనేది జ‌మ్మూ కాశ్మీర్ ప్ర‌ధాన స‌మ‌స్య అని పేర్కొన్నారు.

దానిని పున‌రుద్ద‌రించేందుకు త‌మ పార్టీ పూర్తి శ‌క్తిని ఉప‌యోగిస్తుంద‌ని స్ప‌ష్టం చేశారు కాంగ్రెస్ అగ్ర నాయ‌కుడు. జ‌మ్మూ లోని స‌త్వారి చౌక్ లో జ‌రిగిన స‌మావేశంలో పాల్గొన్నారు. యాత్ర సంద‌ర్భంగా చాలా మంది నాతో త‌మ ఇబ్బందులు ఏమిటో చెప్పారు. వారి స‌మ‌స్య‌లు ప్ర‌ధానంగా ఉన్నాయి. పాల‌నా యంత్రాంగం త‌మ గొంతు విన‌డం లేద‌ని ఆవేద‌న చెందార‌ని రాహుల్ గాంధీ తెలిపారు.

Also Read : ర‌ఘునాథ్ ఆల‌యంలో రాహుల్ గాంధీ

Leave A Reply

Your Email Id will not be published!