Janardhan Reddy Chairman : రాజీనామా చేస్తా రాజీ పడను
టీఎస్ పీఎస్సీ చైర్మన్
Janardhan Reddy Chairman : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వ్యవహారం పై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఇప్పటికే పేపర్ లీక్ వ్యవహారం తీవ్ర కలకలం రేపింది. ఇందుకు సంబంధించి తెలంగాణ సీఎస్ శాంతి కుమారి ఆధ్వర్యంలో సమీక్ష చేపట్టారు. అనంతరం మీడియాతో మాట్లాడారు టీఎస్ పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ వాపోయారు.
తన ఇన్నేళ్ల కెరీర్ లో ఏ తప్పు చేయలేదన్నారు. తాను కడిగిన ముత్యాన్ని అని, తన పిల్లలు విదేశాల్లో ఉంటున్నారని చెప్పారు. అక్కడ ఉన్న వారు ఇక్కడికి వచ్చి పరీక్షలు ఎలా రాస్తారంటూ ప్రశ్నించారు. దేనికైనా హద్దు అనేది ఒకటి ఉంటుందన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఎలా ఆరోపణలు చేస్తారంటూ నిలదీశారు.
గతంలోనే టీఎస్ పీఎస్సీ ఎన్నో సంస్కరణలు తీసుకు వచ్చిందన్నారు. ప్రతి పరీక్షను పారదర్శకంగా నిర్వహించామన్నారు. తొలి సారిగా దేశంలోనే జంబ్లింగ్ విధానాన్ని అమలు చేశామన్నారు. మాస్ కాపియింగ్ కు ఎలాంటి ఆస్కారం లేదని స్పష్టం చేశారు జనార్దన్ రెడ్డి(Janardhan Reddy Chairman). ఇప్పటి వరకు 26 నోటిఫికేషన్లు ఇచ్చామని తెలిపారు. 7 నోటిఫికేషన్లకు సంబంధించిన పరీక్షలు పూర్తయినట్లు స్పష్టం చేశారు చైర్మన్.
పేపర్ హ్యాక్ విషయంలో సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారం చేస్తున్నారంటూ ఆరోపించారు. వదంతులకు కూడా ఓ హద్దు ఉంటుందన్నారు. ఆ పరిస్థితే వస్తే అవసరమైతే రాజీనామా చేస్తా కానీ రాజీ పడనని అన్నారు జనార్దన్ రెడ్డి(Janardhan Reddy). తెలంగాణ విద్యార్థులకు న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే గ్రూప్ -1 మెయిన్స్ కు ఎక్కువ మందిని ఎంపిక చేశామన్నారు.
Also Read : టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీపై సిట్