#IndianConstitutionDay : జనవరి 26… భారత రాజ్యాంగ అమలు దినం
Indian Constitution Day : భారత రాజ్యాంగం ద్వారా భారత దేశానికి గణతంత్ర ప్రతిపత్తి వచ్చింది. 1950 జనవరి 26 న భారత రాజ్యాంగాన్ని అమలు పరిచిన తరువాత స్వతంత్ర భారతదేశం సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా అవతరించింది.
Indian Constitution Day : భారత రాజ్యాంగం ద్వారా భారత దేశానికి గణతంత్ర ప్రతిపత్తి వచ్చింది. 1950 జనవరి 26 న భారత రాజ్యాంగాన్ని అమలు పరిచిన తరువాత స్వతంత్ర భారతదేశం సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా అవతరించింది. ప్రతి సంవత్సరం భారత రాజ్యాంగ అమలు దినమైన. జనవరి 26 రోజును గణతంత్ర దినంగా(Indian Constitution Day )జరుపు కుంటారు.
పొట్టకూటికోసం, వ్యాపారం పేరుతో, మన దేశంలో అడుగు పెట్టిన శ్వేత జాతీయులు, చివరకు మన దేశాన్ని, రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యంలో భాగంగా చేసుకోగా, సుదీర్ఘకాలం పరాయి పాలనలో మగ్గిన దేశం భారతదేశం. ఎందరో స్వాతంత్ర్య సమర యోధుల త్యాగ ఫలితాలతో 1947 ఆగస్టు 15న స్వతంత్ర భారత మాత స్వేచ్చా వాయువులు పీల్చ గలిగింది. స్వయం పాలనాధికారాన్ని దక్కించుకున్న దేశంలోని అన్ని మతాలు, తెగలు, నిమ్న దళితులు, గిరిజనులు, వెనుక బడిన కులాల తదితర వర్గాలకు సైతం న్యాయం జరిగేలా, వారి హక్కులకు భంగం వాటిల్లకుండా ఉండేందుకు, సర్వసత్తాక సౌర్వభౌమాధికారాన్ని దక్కించు కొనేందుకు వీలుగా రాజ్యంగాన్ని రూపొందించాల్సిన బాధ్యత అప్పటి ప్రభుత్వంపై పడింది.
రాజ్యాంగం అంటే దేశానికి, ప్రజలకు, ప్రభుత్వానికి కరదీపిక లాంటిది. ఆ దీపస్తంభపు వెలుగుల్లో సర్వసత్తాక సౌర్వభౌమాధికార దేశంగా ప్రగతి వైపు అడుగులు వేయాలి. అందుకనే రాజ్యాంగానికి ఆధునిక ప్రజాస్వామ్య చరిత్రలో అంతటి విశిష్టమైన స్థానముంది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మన దేశం కంటే ముందు అనేక దేశాలు రాజ్యాంగాలను రచించాయి.
అయితే భారత రాజ్యాంగ రచన ఒక సంక్లిష్టం. దేశంలో అనేక మతాలు, తెగలు, ఆదీవాసీలు, దళితులు, అణగారిన, పీడనకు గురైన వర్గాలు… తదితరులు ఎందరో ఉన్నారు. సదరు వర్గాల ఆకాంక్షలకు అనుగుణంగా రాజ్యాంగ రచన నిస్సందేహంగా ఒక పెద్ద సవాలే. ఇందుకు భారత తొలి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ నేతృత్వంలో డా.బాబా సాహెబ్ అంబేద్కర్ అధ్యక్షతన (ముసాయిదా) డ్రాఫ్టింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. రాజ్యాంగాన్ని తయారు చేసుకోవడానికి దేశంలోని సుప్రసిద్ధ నాయకులు, న్యాయ కోవిదులు అనుభవజ్ఞులు, విద్యావేత్తలు, వివిధ రంగాల నిపుణులు, ప్రముఖులతో రాజ్యాంగ నిర్మాణ సభను నిర్వహించు కున్నారు.
రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్ భిన్నత్వ సమ్మేళితమైన దేశానికి రాజ్యాంగాన్ని రూపొందించడంలో ప్రముఖ పాత్రలో ఎంతగానో శ్రమించారు. ప్రభుత్వ విధి విధానాలు, శాసన సభల రూపకల్పనతో పాటు కోట్లాది మంది పీడిత ప్రజల ఆశయాలను ప్రతిబింభించేలా రాజ్యాంగాన్ని లిఖించారు. కులాలు, విభిన్న మతాలు, రకరకాల కట్టూ బొట్టు ఆచార వ్యవహారాల సంఘటిత భారతావనికి స్వపరిపాలనా రూపకల్పనను రాజ్యాంగ బద్దం చేశారు.
రాజ్యాంగ(Indian Constitution Day )మంటే కేవలం ప్రభుత్వ విధి విధానాలు, శాసన సభల రూపకల్పనే కాదు… కోట్లాది పీడిత ప్రజల ఆశయాలను ప్రతిబింభించాలన్నది బాబా సాహెబ్ ప్రధానాశయం. ఆయన కృషి ఫలితంగానే ప్రపంచంలోనే కొత్తదైన రాజ్యాంగం రూపు దిద్దుకుంది. అందుకనే ప్రపంచంలోని అనేక దేశాల రాజ్యాంగాల కంటే భారత రాజ్యాంగం ఉన్నత విలువలు కలిగిందంటూ మన్ననలు పొందింది. అంబేద్కర్ చైర్మన్‌గా, జవహర్‌లాల్ నెహ్రూ, మౌలానా అబుల్ కలాం ఆజాద్, సర్దార్ పటేల్, ఆచార్య జె.బి.కృపలానీ, డా.రాజేంద్ర ప్రసాద్, సరోజినీ నాయుడు, రాజాజీ, వల్లబ్ పంత్, బి.ఆర్.అంబేద్కర్, టంగుటూరి ప్రకాశం పంతులు, పట్టాభి సీతారామయ్య మొదలైన వారు ఈ సభలో సభ్యులు.
2 సంవత్సరాల, 11 నెలల, 18 రోజులు కష్టించి, రాజ్యాంగ సభ మొదటి సమావేశం 1946, డిసెంబర్ 9తో ప్రారంభించి 11 సార్లు, 165 రోజుల పాటు సమావేశాలు జరగగా, ఇందులో 114 రోజులు రాజ్యాంగం రాత ప్రతిపై వెచ్చించింది. రాజ్యాంగ రాతప్రతిని తయారుచేసే క్రమంలో రాజ్యాంగ సభ ముందుకు 7,635 సవరణ ప్రతిపాదనలు వచ్చాయి. వీటిలో 2,473 ప్రతిపాదనలను పరిశీలించి, చర్చించి, పరిష్కరించింది.
ఏడు దశాబ్దాల కిందట 26నవంబర్ 1949నాడు డాక్టర్ బాబు రాజేంద్రప్రసాద్ అధ్యక్షతన సర్ధార్ వల్లభాయి పటేల్ ప్రతిపాదించి ప్రవేశపెట్టారు. అందమైన చేతిరాతతో హిందీ, ఇంగ్లీషు ప్రతులను, 24 జనవరి 1950న 284 మంది సభ్యుల సంతకాలతో అమోదించారు. రెండు రోజుల తర్వాత 26 జనవరి 1950నుంచి మన రాజ్యాంగం అమలులోకి వచ్చింది. రాజ్యాంగాన్ని సభలో ప్రవేశపెట్టే ముందు అప్పటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్రప్రసాద్… మహాత్మాగాంధీకి నివాళులు అర్పించి ప్రసంగించారు. రాజ్యాంగాన్ని ఆమోదించిన తర్వాత జాతీయ గీతం ‘జనగణమన’ను స్వాతంత్ర్య సమర యోధురాలు పూర్ణిమా బెనర్జీ ఆలపించారు.
భారత రాజ్యాంగం ప్రపంచంలోని అతి పెద్ద లిఖిత రాజ్యాంగాలలో ఒకటి. భారత రాజ్యంగ రూపకల్పన సమయంలో 8 షెడ్యూళ్ళు ఉండగా ప్రస్తుతం 12 షెడ్యూళ్ళు ఉన్నాయి. అవతారిక, 448 అధికరణాలు, 12 షెడ్యూళ్ళతో కూడిన గ్రంథం ఇది. రాజ్యాంగం భారత ప్రభుత్వ వ్యవస్థ, రాష్ట్రాలు, రాష్ట్రాల నిర్మాణం, కేంద్ర రాష్ట్ర సంబంధాలు, కేంద్ర రాష్ట్రాల విధులు, అధికారాలు, స్థానిక సంస్థలు, ఎన్నికలు మొదలైన విషయాలను నిర్వచించింది. ప్రధానంగా ప్రజలందరికీ స్వేచ్ఛ, పార్ల మెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ, బలమైన కేంద్రంతో కూడిన సమాఖ్య వ్యవస్థ, ప్రాథమిక విధులు, ప్రాథమిక హక్కులు, ఆదేశ సూత్రాలు, ద్వి సభా విధానం, భాషలు, వెనక బడిన సామాజిక వర్గాల సంబంధిత అంశాలన్నీ చేర్చబడినాయి. 1936 భారత ప్రభుత్వ చట్టం ప్రకరణలు , 16 షెడ్యూళ్ళు, 14 విభాగాలు ఉండగా, దానిని రద్దు పరుస్తూ, 315 నిబంధనలు , 8పెడ్యూళబ్ళు భారత రాజ్యాంగ రూపకల్పనా సమయంలో ఉండగా, ప్రస్తుతం 12 ఉన్నాయి. 1951లో మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా 9వ షెడ్యూల్ ను చేర్చగా , 1985లో 52 వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజీవ్ గాంధీ ప్రధాని కాలంలో 10వ షెడ్యూల్, తర్వాత 1992 సంవత్సరంలో 73, 74 రాజ్యాంగ సవరణల ద్వారా 11 మరియు 12 వ షెడ్యూల్స్ ను చేర్చడం జరిగింది.
భారత దేశ గణతంత్ర దినోత్సవాన్ని(Indian Constitution Day )భారత రాజ్యాంగం అమలు లోనికి వచ్చిన రోజు జరుపుకునే సంప్రదాయాచరణ అమలవుతున్నది. 1935 భారత ప్రభుత్వ చట్టానికి బదులు భారత రాజ్యాంగం దేశ పరిపాలనకు మార్చడాన్ని “భారత దేశ గణతంత్ర దినం”అంటారు. భారత రాజ్యాంగ సభలో 1949 నవంబర్ 26న రాజ్యాంగం ఆమోదం పొంది, 1950 జనవరి 26న దీనిని ప్రజాతంత్ర పాలన పద్దతి ‘ న అమల్లోకి తేవాలని నిర్ణయించారు. జనవరి 26 ను ,”స్వతంత్ర దినం”గా వ్యవహరించగా, దేశ స్వాతంత్ర్య దినం బ్రిటిషర్లు నిర్ణయించినది కావడం వల్ల, నెహ్రూ తదితర జాతీయోద్యమ అగ్రనేతలు జనవరి 26 ను దేశ గణతంత్ర దినంగా చేశారు.
రాజ్యాంగ మౌలిక లక్ష్యం… సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అందరరికీ అంచించడం. ఈ లక్ష్యము ప్రజల హక్కులకు రూపాన్ని ఇచ్చింది. ప్రజాస్వామ్య సంప్రదాయాలను పరిరక్షించేందుకు స్వతంత్ర ప్రతిపత్తి గల, సమర్ధ వంతమైన న్యాయాన్ని ఇవ్వగల వ్యవస్థ రూప కల్పనే రాజ్యాంగం. రాజ్యాంగ(Indian Constitution Day )అమలు ద్వారా పౌర హక్కుల అవగాహనను వివిధ దశల్లో విస్తృత పరిచారు. ప్రాధమిక హక్కులకు పెద్దపీట వేశారు.
ప్రభుత్వాలు చట్టాలు ప్రజా వ్యతిరేకముగా ఉన్నా రాజ్యాంగాన్ని అతిక్రమించేవిగా ఉన్నా అవి చెల్లవని చెప్పే అధికారము రాజ్యాంగ ధర్మాసనాలకు ఉన్నది .. సుప్రీం కోర్టు ఇచ్చే తీర్పులకు కూడా చట్ట హోదా ఉంటుంది.
ఒక్క అమాయకుడికి కూడా అన్యాయము జరగ కూడదన్న సూత్రము న్యాయ వ్యవస్థకు పునాది. భాదితుల హక్కులను కాపాడటం. తీవ్రమైన నేరాలను నివారించడం, శాంతి, భద్రతలకు భంగం వాటిల్లకుండా చేయడానికి ప్రతి ఒక్కరి భాగస్వామ్య యుత కృషి జరగాలి. అప్పుడే రాజ్యాంగ లక్ష్యం, న్యాయ పరిరక్షణ సాకారం కాగలుగుతాయి

No comment allowed please