Japan PM Bomb Attack : జ‌పాన్ పీఎంపై బాంబు దాడి

జ‌పాన్ లో వ‌రుస‌గా దాడుల ఘ‌ట‌న‌

Japan PM Bomb Attack : జ‌పాన్ ప్ర‌ధాన‌మంత్రి కిషిదా తృటిలో బాంబు దాడి నుంచి త‌ప్పించుకున్నాడు. అధికారిక కార్య‌క్ర‌మంలో బాగంగా జ‌పాన్ లోని వ‌యామా సిటీలో జ‌రిగిన స‌మావేశానికి హాజ‌ర‌య్యాడు. ఇదే స‌మ‌యంలో కిషిదా ప్ర‌సంగించేందుకు రెడీ అవుతుండ‌గానే ఉన్న‌ట్టుండి మీటింగ్ లో బాంబు పేలింది. దీంతో సెక్యూరిటీ వెంట‌నే తేరుకున్నారు. పెద్ద ఎత్తున గుమి గూడారు.

పీఎంకు ర‌క్ష‌ణాత్మ‌కంగా నిలిచారు. ప్ర‌ధాన మంత్రి ఫుమియో కిషిదాను (Japan PM Bomb Attack) ల‌క్ష్యంగా చేసుకునే ఈ దాడికి పాల్ప‌డిన‌ట్లు భావిస్తున్నారు. ఈ అనుకోని ఘ‌ట‌న‌తో ఒక్క‌సారిగా దేశ వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపింది. పీఎంను అక్క‌డి నుంచి భారీ భ‌ద్ర‌త మ‌ధ్య త‌ర‌లించారు. 

ఈ ఘ‌ట‌న‌లో బాంబు విసిరిన ఆగంత‌కుడిని అదుపులోకి తీసుకున్నారు. నిజ‌మైన బాంబా లేక పొగ బాంబా అన్న‌ది ఇంకా తెలియ రాలేదు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి పూర్తి వివ‌రాలు వెల్ల‌డించ లేదు పోలీసులు. దేశమంత‌టా రెడ్ అల‌ర్ట్ వాతావ‌ర‌ణం నెల‌కొంది.

ఇదిలా ఉండ‌గా జ‌పాన్ టెక్నాల‌జీకి ప్ర‌సిద్ది. అత్యంత ప్ర‌శాంత‌త‌ను కోరుకునే ఈ దేశంలో ఇటీవ‌ల వ‌రుస దాడుల ఘ‌ట‌న‌లు చోటు చేసుకోవ‌డం విస్తు పోయేలా చేసింది. గ‌డిచిన ఆరు నెల‌ల కాలంలో ఇది రెండో ఘ‌ట‌న‌. ప‌బ్లిక్ మీటింగ్ లో ప్ర‌సంగిస్తున్న స‌మ‌యంలో ప్ర‌ధాని షింజో అబేను కాల్చి చంపాడు ఓ ఆగంత‌కుడు. ప్ర‌స్తుత పీఎం కూడా ఇదే త‌ర‌హా దాడి జ‌ర‌గ‌డం అక్క‌డి రాజ‌కీయ అనిశ్చిత ప‌రిస్థితిని తెలియ చేస్తోంది.

Also Read : న్యాయ వ్య‌వ‌స్థ అత్యంత కీల‌కం

Leave A Reply

Your Email Id will not be published!