Jayant Chaudhary : అగ్నిపథ్ స్కీంను రద్దు చేయండి – జయంత్
మోదీ సర్కార్ అనాలోచిత నిర్ణయం
Jayant Chaudhary : కేంద్రం తీసుకు వచ్చిన అగ్నిపథ్ రిక్రూట్ మెంట్ స్కీంను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు రాజ్యసభ ఎంపీ జయంత్ చౌదరి(Jayant Chaudhary). ఆందోళనకారులు, నిరసనకారులు హింసను విడనాడాలని కోరారు.
హింసా మార్గం వల్ల ఏమీ సాధించలేమని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య పద్దతిలో శాంతియుతంగా ఆందోళన చేపట్టాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తూ వస్తోందని ఆరోపించారు.
అందులో భాగంగా ప్రభుత్వ ఆస్తులను అమ్మడం, సంస్థలను నిర్వీర్యం చేయడంగా ప్రధానంగా పెట్టుకుందన్నారు జయంత్ చౌదరి. ఇందులో భాగంగానే సాయుధ దళాల్లో కాంట్రాక్టు పద్దతిలో యువకులను భర్తీ చేయాలని అనుకోవడం దారుణమన్నారు.
ఇంతకన్నా దౌర్భాగ్యకరమైన పరిస్థితి రాకూడదన్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించే వారిలో జవాన్లు ముందుంటారు. వారికి ఏమిచ్చి రుణం తీర్చు కోగలమన్నారు ఎంపీ(Jayant Chaudhary).
ఇప్పటికే మోదీ ప్రైవేట్ పరం జపం చేస్తున్నారని చివరకు కీలకమైన రక్షణ రంగాన్ని కూడా ప్రైవేట్ వ్యక్తులు, సంస్థలకు అప్పగిస్తే మిగిలేది దేశంలో మనుషులు మాత్రమే ఉంటారని కుండ బద్దలు కొట్టారు.
దేశంలో 60 లక్షల జాబ్స్ ఖాళీగా ఉన్నాయని తాను చెప్పడం లేదని భారతీయ జనతా పార్టీకి చెందిన ఎంపీ చెప్పారని కానీ మోదీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని 10 లక్షలు భర్తీ చేస్తున్నారంటున్నారని ధ్వజమెత్తారు.
ఇకనైనా ముందు వెనుకా ఆలోచించకుండా అగ్నిపథ్ స్కీంను వెనక్కి తీసుకోవాలని జయంత్ చౌదరి(Jayant Chaudhary) డిమాండ్ చేశారు. జాబ్స్ రాక పోతే తమ పిల్లలకు పెళ్లిళ్లు కావేమోనని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు ఎంపీ.
Also Read : రైల్వే ఆస్తులను ధ్వంసం చేయొద్దు – వైష్ణవ్