Jean Dreze : ప్రజా సంక్షేమం మోదీ ప్రచారం
ధ్వజమెత్తిన ఆర్థికవేత్త జాన్ ద్రీజ్
Jean Dreze : ప్రముఖ ఆర్థిక వేత్త, సామాజిక చింతనా పరుడిగా పేరొందిన జాన్ ద్రీజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ దేశంలో మోదీ కొలువు తీరిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ప్రతి పథకం, కార్యక్రమం కేవలం ప్రజల కోసం కాకుండా నరేంద్ర దామోదర దాస్ మోదీ ప్రచారానికే పనికి వస్తున్నాయంటూ సంచలన ఆరోపణలు చేశారు.
ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం కలకలం రేపుతున్నాయి. కేంద్ర బడ్జెట్ లో పేదలు, సామాన్యుల గురించి ప్రస్తావనే లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆహార సబ్సిడీలోనూ కోత పెట్టారని , ఇది ఎలా సంక్షేమం అవుతుందని జాన్ ద్రీజ్(Jean Dreze) ప్రశ్నించారు.
సామాజిక భద్రత లేకుండా పోయిందని మండిపడ్డారు. ఇది దేశానికి మంచి పద్దతి కాదన్నారు. వ్యవస్థలను బలోపేతం చేయాల్సిన ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని ఇదెక్కడి న్యాయమని నిలదీశారు జాన్ ద్రీజ్(Jean Dreze). ఇవాళ ఈ దేశంలో కొలువు తీరిన బీజేపీ సర్కార్ కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మాత్రమే నిధులను మంజూరు చేయడం, సంక్షేమ పథకాలను ప్రకటించడం చేస్తోందని ఇది ఏ మాత్రం ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయదని హెచ్చరించారు.
ఇది ఎంత మాత్రం క్షేమకరం కానే కాదని పేర్కొన్నారు. జాతీయ ఆహార భద్రత చట్ట కింద 81.35 కోట్ల మందికి ఏడాది పాటు ఆహార ధాన్యాలు ఉచితంగా ఇస్తామని చెప్పడం ఇది ప్రజలను మోసం చేయడం తప్ప మరొకటి కాదని అన్నారు. కేంద్రం ప్రకటన వెనుక రాజకీయ దురుద్దేశం దాగి ఉందన్నారు జాన్ ద్రీజ్.
Also Read : సీఎం విన్నపం ఎల్జీ ఆమోదం