#JioOffer : సినీ లవర్లకు జియో ఆఫర్
సినీ ప్రేమికులకు ఆనందం
Jio Offer : అంతా ఉచితమే. ఏదీ కట్టకండి. డిజిటల్ మీడియా పుణ్యమా అంటూ దిగ్గజ కంపెనీలు బంపర్ ఆఫర్లు, గిఫ్టులు, కూపన్లు, ఆకట్టుకునే టారిఫ్ లతో హోరెత్తిస్తున్నాయి. అంతే కాకుండా నెట్ ఫ్లిక్స్, అమెజాన్, గూగుల్ ఇలా ప్రతి కంపెనీ వీడియో స్ట్రీమింగ్ మీద దృష్టి పెడుతున్నాయి. ఇప్పటికిప్పుడు చూస్తే భారీ వ్యాపారం జరుగుతోంది సోషల్, డిజిటల్ మీడియా ద్వారా. కోట్లాది రూపాయల దందా సైలంట్ గా కొనసాగుతోంది. దీంతో బడా కంపెనీలన్నీ డిజిటల్ మీడియా జపం చేస్తున్నాయి. వరల్డ్ వైడ్ గా చూస్తే మొత్తం మీడియా బిజినెస్ లో దాదాపు 60 శాతానికి మించి ఇండియాలోనే జరుగుతోంది.
దీంతో దిగ్గజ కంపెనీలన్నీ భారత్ బాట పడ్డాయి. ఇక ఇప్పటికే ఇండియా వ్యాపారంలో నెంబర్ వన్ పొజిషన్ లో కొనసాగుతున్న రిలయన్స్ గ్రూప్ కంపెనీ డిజిటల్ మీడియా మీదే ఎక్కువ కాన్సెన్ట్రేషన్ చేస్తోంది. దీని బిజినెస్ ఊహించని రీతిలో పెరుగుతూ పోతోంది. ఓ వైపు మిగతా ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లు జియో కొడుతున్న దెబ్బకు లబోదిబో మంటున్నాయి. చేసేది లేక సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు దెబ్బకు కునారిల్లి పోయాయి. ఇంకో వైపు వోడా ఫోన్ కంపెనీ ఇంత పెద్ద మొత్తంలో చెల్లించ లేమంటూ కోర్టును ఆశ్రయించింది. అయితే వినియోగదారులను టార్గెట్ గా చేసుకుని దోపిడీకి తెరతీశాయి సదరు కంపెనీలు. మరో వైపు రిలయన్స్ జియో మాత్రం డోంట్ కేర్ అంటోంది. ఆదాయ పరంగా గణనీయమైన లాభాలను గడిస్తోంది.
ఓ వైపు అప్పులు ఉన్నా వాటిని బేఖాతరు చేస్తూ ముందుకే వెళుతోంది. ఇదే సమయంలో తాజాగా టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన జియో దక్షిణాది సినీ ప్రేమికులను అలరించేందుకు సిద్ధమైంది. జియో సినిమా సన్ టీవీ నెట్వర్క్ ఆన్ లైన్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ అయిన సన్ నెక్ట్స్ సహకారంతో దక్షిణ భారత సినిమాలను ప్రేక్షకులకు అందించనుంది. సన్ నెక్ట్స్తో భాగస్వామ్యం కావడం ద్వారా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ సినిమాలను అత్యుత్తమ నాణ్యతతో యూజర్లకు అందించనుంది.
తద్వారా జియో యూజర్లకు సన్ నెక్ట్స్ లైబ్రరీ నుంచి 4 వేల సినిమాలు చూసే అవకాశం లభిస్తుంది. కాగా జియో సినిమా యాప్‌లో ఇప్పటికే 10 వేలకు పైగా సినిమాలు అందుబాటులో ఉన్నాయి. అదే విధంగా లక్షకు పైగా టీవీ షో ఎపి సోడ్ల కంటెంట్‌ను కలిగి ఉంది. ఇక ప్రస్తుతం సన్ నెక్ట్స్ మూవీ కేటలాగ్‌తో అపరిమిత సినిమాలు చూసే వీలును దక్షిణాది ప్రేక్షకులకు కల్పించింది. కాగా దక్షిణ భారత స్టూడియోల నుంచి అతిపెద్ద బ్లాక్‌బస్టర్ సినిమాలకు సన్ నెక్ట్స్ పేరు గాంచింది. మొత్తం మీద మిగతా కంపెనీలకు జియో మరోసారి షాక్ ఇవ్వనుందన్న మాట.
No comment allowed please