SVPNPA Jobs : పోలీసు అకాడెమీలో పోస్టులు

ఆఫ్ లైన్ లో ద‌ర‌ఖాస్తుల ఆహ్వానం

SVPNPA Jobs : ఓ వైపు తెలంగాణ సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ఎలాంటి కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు(SVPNPA Jobs) ఉండ‌వ‌ని ప్ర‌క‌టిస్తే దానికి భిన్నంగా పోలీస్ అకాడెమీలో అవుట్ సోర్సింగ్ ప్రాతిప‌దిక‌న నోటిఫికేష‌న్ ఇచ్చారు.

రాష్ట్రంలో వేలాది పోస్టులు ఖాళీగా ఉన్న‌ప్ప‌టికీ ఈరోజు వ‌ర‌కు ఎలాంటి ప్రాథ‌మిక వివ‌రాలు లేకుండా పోయాయి.

బిశ్వాల్ క‌మిటీ ల‌క్షా 90 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయ‌ని తేల్చింది.

సీఎం మాత్రం 80 వేల 39 పోస్టులు మాత్ర‌మే భ‌ర్తీ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

ఇక పోలీస్ అకాడెమీలో వివిధ కేట‌గిరీల‌కు సంబంధించి నోటిఫికేష‌న్ జారీ చేసింది. కాగా ఈ అకాడెమీ కేంద్ర హోం శాఖ ప‌రిధిలో ప‌ని చేస్తుంది.

ప‌ని అనుభ‌వంతో పాటు కంప్యూట‌ర్ నైపుణ్యం క‌లిగి ఉండాలి. ఇందులో భాగంగా 19 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నుంది. ఇవ‌న్నీ పూర్తిగా అవుట్ సోర్సింగ్ ప‌ద్ద‌తిన ఎంపిక చేస్తారు.

వెట‌ర్న‌రీ ఆఫీస‌ర్ ఒక పోస్టు ఖాళీగా ఉంది. ఇందుకు కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వ సంస్థ‌ల్లో ప‌ని చేసిన వారు కూడా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.
సీనియ‌ర్ సైంటిఫిక్ ఆఫీస‌ర్ సెక్టార్ లో రెండు పోస్టులు ఉన్నాయి.

మాస్ట‌ర్స్ చేసిన వారు అర్హులు. వీరికి రూ. 98 వేలు ఇస్తారు. జూనియ‌ర్ సైంటిఫిక్ ఆఫీస‌ర్ పోస్టు ఒక‌టి ఖాళీగా ఉంది. రూ. 75 వేల 658 వేత‌నం ఇస్తారు. ఎక్స్ రే టెక్నీషియ‌న్ విభాగంలో ఒక పోస్టు ఉంది.

దీనికి రూ. 45 వేల 186 రూపాయ‌లు ఇస్తారు. ఫిజియోథెర‌పిస్ట్ విభాగంలో 2 ఖాళీలు ఉన్నాయి. స్టాఫ్ న‌ర్స్ విభాగంలో ఒక‌టి, ఫిజియో థెర‌పిస్ట్ విభాగంలో రెండు పోస్టులు ఉన్నాయి.

జూనియ‌ర్ ప్రాజెక్టు నిఫ్ట్ లో ఒక పోస్టు ఉంది. కెమెరామెన్ విభాగంలో మూడు పోస్టులు ఉన్నాయి. డేటా ఎంట్రీ ఆప‌రేట‌ర్ విభాగంలో 6 పోస్టులు ఖాళీగా ఉన్నాయ‌ని పోలీస్ అకాడెమీ తెలిపింది.

స్పోర్ట్స్ కోచ్ విభాగంలో ఒక పోస్టు ఉంది. ఆయా పోస్టుల‌కు సంబంధించి ఆఫ్ లైన్ లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. ఈనెల 14 లోగా అప్లై చేసుకోవాలి.

అసిస్టెంట్ డైరెక్ట‌ర్ , ఎస్వీపీ నేష‌న‌ల్ పోలీస్ అకాడెమీ, శివ‌రాంప‌ల్లి, హైద‌రాబాద్ – 500052 అనే చిరునామాకు పంపించాల‌ని సంస్థ పేర్కొంది.

Also Read : గ్రూప్ -1, 2, 3 తో పాటు యూనివ‌ర్శిటీల్లో ఖాళీలు

Leave A Reply

Your Email Id will not be published!