Joe Biden : హక్కుల ఉల్లంఘన బైడెన్ ఆందోళన
స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన సౌదీ యువరాజు
Joe Biden : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సౌదీ అరేబియా పర్యటన పూర్తిగా వివాదాస్పదంగా మారింది. ఇదే సమయంలో జర్నలిస్ట్ ఖషోగ్గీ దారుణ హత్య మరోసారి చర్చకు వచ్చింది.
దీంతో పాటు సౌదీ యువరాజును టార్గెట్ చేయడం ఒకింత ఆశ్చర్యానికి గురి చేసింది. ఇదే సమయంలో సౌదీ, అరబ్ దేశాలలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందంటూ బైడెన్ ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు సౌదీ ప్రిన్స్.
ఇదే సమయంలో మధ్య ప్రాచ్యంలో యుఎస్ చురుకైన భాగస్వామిగా ఉంటుందన్నారు జో బైడెన్(Joe Biden). అందరి భాగస్వామ్యంతో సానుకూల భవిష్యత్తును ఏర్పాటు చేయడంలో భాగంగా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టిందని అన్నారు బైడెన్.
జెడ్డాలో జరిగిన అరబ్ శిఖరాగ్ర సమావేశంలో ఆయన పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ బెదిరింపులను ఎదుర్కొనేందుకు ఇజ్రాయెల్ తో సహా ప్రాంతీయ భద్రతా కూటమికి పునాది వేసేందుకు ఈ సమావేశం దోహద పడగలదని వాషింగ్టన్ పోస్ట్ ప్రత్యేక కథనంలో పేర్కొంది.
ఇదే సమయంలో జోసెఫ్ బైడెన్(Joe Biden) సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహ్మద్ బిన్ సల్మాన్ తో జరిగిన భేటీలో మానవ హక్కులకు సంబంధించిన అత్యంత సున్నితమైన అంశాన్ని లేవనెత్తారు.
సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్మాన్ అల్ సౌద్ ఈ సందర్భంగా మాట్లాడారు. గల్ఫ్ ఇజ్రాయెల్ రక్షణ కూటమిపై ఎటువంటి చర్చలు జరిగనట్లు తనకు తెలియదన్నారు. అలాంటి చర్చలలో తమ దేశం ప్రమేయం లేదన్నారు.
ఖషోగ్గీ హత్య వంటి తప్పులు పునరావృతం కాకుండా సౌదీ అరేబియా చర్యలు తీసుకుందని ప్రిన్స్ చెప్పినట్లు సమాచారం.
Also Read : ఖషోగ్గీ హత్యోదంతం యువరాజు దరహాసం