Joe Biden : అన్యాయంపై న్యాయం గెలిచింది – బైడెన్
అల్ ఖైదా చీఫ్ అల్ జవహరి ఖతంపై కామెంట్
Joe Biden : 21 ఏళ్ల తర్వాత అమెరికా బదులు తీర్చుకుంది. తమపై రాకెట్ దాడితో బెంబేలెత్తించి అమెరికన్ల ప్రాణాలను పొట్టన పెట్టుకున్న ఘటనలో కీలకంగా వ్యవహరించిన బిన్ లాడెన్ ను పాకిస్తాన్ లో మట్టుబెట్టింది.
మరో కీలక పాత్ర వహించిన అమాన్ అల్ జవహరిని ఖతం చేసింది. ఈ ఘటన ఆఫ్గనిస్తాన్ దేశ రాజధాని కాబూల్ లో ఓ ఇంట్లో తలదాచుకున్న అతడిని గుర్తించి మట్టుబెట్టింది.
వరల్డ్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ గా పేరొందాడు అల్ జవహరి. ఈ ఘటన ఆదివారం యుఎస్ జరిపిన డ్రోన్ దాడిలో చంపేసినట్లు స్వయంగా అమెరికా దేశ అధ్యక్షుడు జోసెఫ్ బైడెన్(Joe Biden) ప్రకటించాడు.
జాతిని ఉద్దేశించి వెల్లడించాడు. అమెరికాతో పెట్టుకున్న ఏ ఒక్కరినీ వదలబోమని ఈ సందర్భంగా హెచ్చరించాడు. ప్రజల ప్రాణాలతో కానీ లేదా తమ దేశంతో యుద్దం చేయాలని అనుకునే ఏ ఒక్కరినీ విడిచి పెట్టే ప్రసక్తి లేదన్నాడు.
ఈ సందర్భంగా షాకింగ్ కామెంట్స్ చేశాడు. అన్యాయంపై న్యాయం గెలిచిందని , అల్ జవహరిని చంపడంతో బదులు తీర్చుకున్నామని అన్నారు బైడెన్.
యుఎస్ వైమానిక దాడుల్లో మరణించిన అల్ జవహరి వయస్సు 71 ఏళ్లు. ప్రస్తుతం చనిపోయే కంటే ముందు ప్రపంచ వ్యాప్తంగా చోటు చేసుకున్న ఉగ్రవాద కార్యకలాపాలకు కీలకంగా వ్యవహరిస్తూ వస్తున్నాడు అల్ జవహరి.
ఆనాటి ఘోరమైన దుర్ఘటనలో 3,000 మంది కుటుంబాలకు అన్యాయం జరిగిందన్నారు. ఈ ఆపరేషన్ లో పౌరులకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిపారు బైడెన్. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా వెతికి పట్టుకుంటాం. వదలి పెట్టే ప్రసక్తి లేదని హెచ్చరించారు.
Also Read : అల్ జవహరి హతం తాలిబన్ ఆగ్రహం